ప్రపంచానికి మొట్టమొదటిగా గొప్ప విద్యను అందించిన మహా విశ్వవిశ్యాలయం మన దేశం లోనే ఉంది. ఎందరో మహాజ్ఞానుల బోధనలకు చిహ్నంగా ఉండిన ఈ విశ్వవిద్యాలయమే నలంద విశ్వవిద్యాలయం. దీనినే ఒకప్పుడు నలంద మహావిహార అని పిలిచేవారు.
ఒకప్పుడు ప్రపంచానికి గొప్ప విద్యను అందించిన ఈ విశ్వవిద్యాలయం ఎందుకు కొంత కాలం తర్వాత పతనానికి గురి అయింది; ఇంతటి గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఎవరు కట్టించారు; మళ్ళి ఇప్పుడు ఎప్పుడు పునః ప్రారంభించారు? ఇలా ఎన్నో విషయాలు మనకు తెలీదు.
మన దేశంలోని ఖ్యాతిని మనం తెలుసుకోవడం ఒక భారతీయ పౌరుడిగా మన బాధ్యత. ఇప్పుడు ఈ విశ్వద్యాలయం గురించి తెలుసుకుందాం రండి.
నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది:
బీహార్లో పాట్నా కి తూర్పు దిక్కున 90 km ల దూరం లో అందమైన రాజగిరి కొండల నడుమ ఈ విశ్వవిద్యాలయం నిర్మించి ఉంది. 5వ శతాబ్దం లో మగధ సామ్రాజ్యం(ప్రస్తుతం బీహార్) ని కుమారగుప్తుడు పరిపాలిస్తున్న సమయం లో అతను పాటలీపుత్ర (ప్రస్తుత పాట్నా) కి దగ్గరగా ఉన్న రాజ్గ్రిహ(ప్రస్తుతం రాజగిర్) దగ్గర ఈ నలంద మహావిహార ను నిర్మించారు.
ఇది కట్టించినప్పటి నుంచి 700 సంవత్సరాలు ప్రపంచంలోని గొప్ప మేధావులందరికి విద్యను బోధించింది. మొత్తం 450 ఎకరాల స్థలం లో ఈ విశ్వవిద్యాలయం నిర్మించబడింది. ఈ విశ్వవిద్యాలయం లో బౌద్ధ మతం, వైద్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణితం, ఫిలాసఫీ, లాజిక్, ఇలా మొదలైన సబ్జెక్టులను బోధించేవారు.
ఈ విషయాల అన్నిటి మీద మొత్తంగా 9 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ 10000 మంది విద్యార్థులకు 2000 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. చాణక్య, ఆర్యభట్ట, నాగార్జున, ధర్మకృత, ఇలా గొప్ప మేధావులు అందరు ఇక్కడ ఉపాధ్యాయులుగా బోధించారు.
అప్పటి కాలం లోనే ఇక్కడ చదువుకోవడానికి ఇతర దేశాల నుండి ఎంతో మంది విద్యార్థులు వచ్చేవారు; ముఖ్యంగా శ్రీలంక, చైనా, కొరియా, జపాన్, మంగోలియా, దక్షిణ ఆసియ కాండం నుండి వచేవారు. హీయున్-త్సాంగ్ అనే చైనా యాత్రికుడు ఇక్కడే 5 సంవత్సరాలు చదువుకున్నాడు. అతను తన డైరీ లో ఈ విశ్వద్యాలయానికి ప్రవేశ పరీక్షా గురించి చెప్తూ “ఎన్నో గంటల పటు మౌఖిక పరీక్ష జరిగేది కానీ ఆ మౌఖిక పరీక్షకి వచ్చిన వాళ్ళల్లో కేవలం 20% మందే క్వాలిఫై అయ్యేవారు అని చెప్పారు.”
నలంద విశ్వవిద్యాలయం నాశనానికి కారణం:
ఒకప్పుడు ప్రపంచానికి ఉన్నత విద్యను అందించిన నలంద విశ్వవిద్యాలయం కాలం గడుస్తున్నకొద్దీ పతనానికి గురి అయింది. ఇది కట్టినప్పటి నుంచి 3 సార్లు దీనిని కూలదోశారు దాంట్లో రెండు సార్లు తిరిగి నిర్మించారు. మొదటి సారి మిహిరాకులు పరిపాలిస్తున్నప్పుడు హున్స్ (HUNS) దీనిని నాశనం చేసారు.
రెండో సారి 7వ శతాబ్దం లో గౌడాస్ (Goudas) నాశం చేసారు. అప్పుడు బౌద్ధ మహారాజు అయినా హర్షవార్డునుడు దీనిని తిరిగి నిర్మించాడు.
ఇక మూడోసారి 1193CE లో ముస్లిం ఆర్మీ కి చెందిన ఒక తుర్కీష్(Turkish) అక్రమణదారుడు అయినా భక్తియార్ ఖిల్జీ(bhakthiyar khilji) ఉత్తర భారత దేశం పై యుద్ధం చేసే సమయం లో నలంద విశ్వవిద్యాలయం లోని లైబ్రరీ ని కాల్చివేసాడు. ఆ కాల్పులో ఆ లైబ్రరీ లోని 9లక్షల పైగా పుస్తకాలు దహనం అయిపోయాయి, ఆ మంటలు 3 నెలల పైగా కల్తూనే ఉన్నాయి.
ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం:
ఈ విశ్వవిద్యాలయం కనుమరుగు అయిపోయాక దీని శిథిలాలను మొదటగా 1812 లో స్కాటిష్ సర్వేయర్ ఫ్రాన్సిస్ బుచానన్ హామిల్టన్ కనుగొన్నారు. తర్వాత 1861 లో జేమ్స్ కన్నింగ్హమ్ దీనిని ఒక పురాతన విశ్వవిద్యాలయంగా గుర్తించారు. 2006 మార్చ్ లో బీహార్ లో జరిగిన ఒక అసెంబ్లీ సెషన్ లో ఏపీజే అబ్దుల్ కలాం ఈ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలి అని చెప్పారు.
ఈ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధించడానికి ఇండియ పార్లిమెంట్ 2014 సెప్టెంబర్ లో నలంద యూనివర్సిటీ ఆక్ట్ 2010 ను ప్రవేశ పెట్టేరు. నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధించడానికి ఏకంగా 17 దేశాలు-ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లాఓస్, మారిషస్, మయన్మార్, న్యూజీలాండ్, పోర్చుగల్, సింగపూర్, సౌత్ కొరియా, శ్రీలంక, థాయిలాండ్ మరియు వియత్నాం; ఈ దేశాలు నలంద విశ్వవిద్యాలయాన్ని పునః ప్రారంభించడానికి సహాయం చేసాయి.
ఈ విశ్వవిద్యాలయాన్ని పునః నిర్మించడానికి భారత ప్రభుత్వం గొప్ప పేరు పొందిన ఆర్కిటెక్ట్ అయినా బి.వి.దోషి ని నియమించారు. మొదటగా ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి 485 ఎకరాలలో 1800 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఈ ప్రదేశంను కార్బన్ ఫ్రీ ఫుట్ ప్రింట్ ఏరియా గా నిర్దారించింది.
ప్రస్తుత్తం నూతనంగా నిర్మించిన నలంద విశ్వవిద్యాలయం ను బౌద్ధ మొనాస్టరీస్ నుంచి స్ఫూర్తి ని తీసుకొని నిర్మించారు. ఇక్కడ 100 ఎకరాల తామర కొలనులు, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్, 250 మంది కూర్చోగలిగే యోగ కేంద్రం, ఇంకా ఇక్కడ ఉన్న లైబ్రరీ ని ధర్మ గూంజ్(mountain of truth) అని పిలుస్తారు. ప్రస్తుతానికి ఈ విశ్వవిద్యాలయం లో 20 దేశాల నుండి విద్యార్థులు వివిధ కోర్సులలో ఎన్రోల్ అయ్యారు. 2014 లో 15 మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం లో అడ్మిషన్ పొందారు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను సందర్శించండి.