Home » పంచభక్షపరమాన్నలు అనే పదం కి అర్ధం తెలుసుకోండి

పంచభక్షపరమాన్నలు అనే పదం కి అర్ధం తెలుసుకోండి

by Nikitha Kavali
0 comment

మన పెద్దలు ఆహారాన్ని పంచభక్ష్యపరమాన్నాలుగా చూసే వారు. అసలు పంచభక్ష్యపరమాన్నాలు అంటే ఏంటి ఎందుకు ఆ పదాన్ని మనం తినే ఆహారానికి వాడారు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం రండి.

మనం తినే ఆహారాన్ని మన పెద్దలు అయిదు రకాలుగా విభజించారు. మనం తినే ఆహార పదార్థాన్ని బట్టి అంటే మనం కొన్ని నమిలి తింటాము, కొన్ని కొరికి తింటాము, కొన్ని చప్పరిస్తాము ఆలా ఆహారాన్ని అయిదు రకాలుగా విభజించారు.

భక్ష్యం:

భక్ష్యం అంటే కొరికి తినేవి (బూరెలు, గారెలు, అప్పడాలు, మొదలైనవి)

భోజ్యం అంటే నమిలి తినేవి (పులిహోర, దధోజనం, మొదలైనవి)

చోష్యం అంటే జుర్రుకునేవి (పాయసం, రసం. సాంబార్. మొదలైనవి)

లేహ్యం అంటే చప్పరించేవి (తేనె, బెల్లం పాకం, చలివిడి మొదలైనవి)

పానీయం అంటే తాగేవి (పళ్ళ రసాలు, మజ్జిగ,నీళ్లు మొదలైనవి)

ఈ పైన తెలిపిన అయిదు రకాల ఆహారాన్ని పంచభక్ష్యాలు గా పిలుస్తాము.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్, ఫ్యాక్ట్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment