Home » అమ్మా భవాని లోకాలనేలే (Amma Bhavani Lokalanele) సాంగ్ లిరిక్స్ – Siva Rama Raju

అమ్మా భవాని లోకాలనేలే (Amma Bhavani Lokalanele) సాంగ్ లిరిక్స్ – Siva Rama Raju

by Lakshmi Guradasi
0 comments
Amma Bhavani Lokalanele song lyrics Siva Rama Raju

ఓం శక్తి మహా శక్తి… ఓం శక్తి మహా శక్తి
అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మ
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మ…
అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మ
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…

ఓ ఓఓ… సృష్టికే దీపమా… శక్తికే మూలమా
సింహ రథమే నీదమ్మా… అమ్మ దుర్గమ్మా
భక్తులను దీవించుమా…
అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…

అమ్మా పసుపు కుంకుమ
చందనము పాలభిషేకం…
ఎర్రని గాజులతో పువ్వులతో
నిను కొలిచాము…

అమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడు
అమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడు
అమ్మ పున్నమి పుట్టిల్లు… ఆ కళ్ళు చూడు
అమ్మ ముక్కోటి మెరుపుల… మోము చూడు
అమ్మమ్మ ముగ్గురమ్మల… మూలపుటమ్మ
నీ అడుగులే కాలాలు…

అమ్మ నిప్పుల్ని తొక్కిన… నడక చూడు
అమ్మ దిక్కుల్ని దాటిన… కీర్తి చూడు
వెయ్యి సూరీళ్ళై మెరిసిన… శక్తిని చూడు
మనుషుల్లో దేవుడీ… భక్తుని చూడు
నీ పాద సేవయే… మాకు పుణ్యం
అమ్మ నీ చూపు సోకితే… జన్మ ధన్యం

అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…

ధిన్నకు ధిన్నకుతా… ధిన్నకు ధిన్నకుతా
గల గల గల గల… గల గల గల గల
ధిన్నకు ధిన్నకుతా…

గజ్జెలనే కట్టి… ఢమరుకమె పట్టి
నాట్యమే చేయుట… అమ్మకు ఇష్టమట
ఆ… ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
ఊరే ఊగేల… ఇయ్యాలి హారతి
కాయలు కొట్టి… ఫలములు పెట్టి
పాదాలు తాకితే…
అడిగిన వరములు… ఇచ్చును తల్లి

చీరలు తెచ్చాం… రైకలు తెచ్చాం
చల్లంగా అందుకో…
జయ జయ శక్తి… శివ శివ శక్తి
జయ జయ శక్తి… శివ శివ శక్తి

కంచిలొ కామాక్షమ్మ… మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మ
కాశీలో అన్నపూర్ణవే మాతా…
శ్రీశైలంలో భ్రమరాంబ… బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మా
కలకత్తా కాళిమాతవే మాతా…

నరకున్ని హతమార్చి… శ్రీ కృష్ణున్ని కాచి
సత్యభామై శక్తే చూపినావే…
నరలోక భారాన్ని… భూదేవై మోసి
సాటిలేని సహనం చాటినావే…

భద్రకాళీ నిన్ను… శాంత పరిచేందుకు
రుద్రనేత్రుండు శివుడైన… సరి తూగునా
బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని… తాకగ వచ్చేనట
బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని… తాకగ వచ్చేనట
నీ పదధూళిని… తాకగ వచ్చేనట
నీ పదధూళిని… తాకగ వచ్చేనట

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.