Home » పడి పోయానే నీ మాయల్లో (Padi Poyane Nee mayalo) సాంగ్ లిరిక్స్ – Private 

పడి పోయానే నీ మాయల్లో (Padi Poyane Nee mayalo) సాంగ్ లిరిక్స్ – Private 

by Lakshmi Guradasi
0 comments
padipoyane nee mayalo song lyrics private song

చిలుక గోరింక ప్రేమలో పడిన ఈ జంట
పగలనక రేయనక విహరించెను ఊహలు ఊయ్యలగా

పడి పోయానే నీ మాయలో నేనే
చెడిపోయానే నన్ను కొల్లగొట్టే నవ్వుతోనే
నిన్ను చూడగా నాలో సెగ రాగలగా మొదలయిందే
నీ మోవుపై చమట చుక్క చిందగా గంధమాయేనే

గమత్తుగుంది కిక్కెక్కుతుంది
మత్తెక్కి సొగసుల్లో మాయేదో ఉంది

చిలుక గోరింక ప్రేమలో పడిన ఈ జంట
పగలనక రేయనక విహరించెను ఊహలు ఊయ్యలగా

నింగి తారవో జాబిలమ్మవో
నేలజారెనే నీ అందం
ఇన్నాళ్లు లేదే ఇంత వేదనే
నిన్ను చూసాకే మాటే మౌనం

రంగు రంగు పువ్వులోన వింత బొమ్మవే
నా గుండెల్లోన గీసుకున్న బాపు బొమ్మల్లే
నీ ముద్దు ముద్దు మాటలోన మైకం కమ్మేలే
నీ చుట్టూ నేను తిరుగుతుంటే మదిలో గోలయే

వర్షించే మేగంలో తడి చినుకే నువ్వైతే
నీ స్పర్శే తాకంగా పులకించే నా మనసే

నన్ను విడువకే నిండు జాబిల్లి
కమ్ముకుంటుందే నాలో చీకటి
దూరం వెళ్లకే నన్నే నువ్ విడిచి
కడలై పొంగేనే నాలో కంట తడి

కళ్ళలోన నింపుకున్న నీపై ప్రేమని
చూపించే లోగా నువ్ వెళ్లకే మరి

చిలుక గోరింక ప్రేమలో పడిన ఈ జంట
పగలనక రేయనక విహరించెను ఊహలు ఊయ్యలగా

నిజమైన నీ ప్రేమ నా కొరకే వేచుందే
నువ్వు తిరిగి వస్తావని మౌనంగా చూస్తుందే
సంద్రాన్నే దాటేసి తీరానికి చేరావే
బంధాన్నే పెనవేస్తూ కౌగిల్లో వాలవే

___________________________________________________________

పాట: పడి పోయానే నీ మాయల్లో (Padi Poyane Nee mayalo)
నటులు: రాహుల్ వర్మ (Rahul Verma) మరియు శ్రీవల్లి విజయ (Srivalli Vijaya)
గాయకులు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
కోరస్: పావని వాసా (Pavani Vasa), తనిష్క (tanishka), సాహితీ మానస్ (sahithi Manas)
సంగీతం: గోపీనాథ్ కేతావత్ (Gopinath Kethavath )

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.