Home » నెలకు 60 వేలతో డిగ్రీ గ్రాడ్యుయేట్ లకు జాబ్స్ .. వెంటనే అప్లై చేసుకోండి

నెలకు 60 వేలతో డిగ్రీ గ్రాడ్యుయేట్ లకు జాబ్స్ .. వెంటనే అప్లై చేసుకోండి

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ | డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి మంచి అవకాశం వచ్చేసింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇన్సూరెన్స్ కంపెనీలో స్థిరమైన గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెతుకుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి. వివరాలలోకి వెళితే…

కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) ప్రధాన కార్యాలయం గ్రాడ్యుయేషన్ హోల్డర్లకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ 500 అసిస్టెంట్ (క్లాస్ III) ఖాళీల కోసం NICL అసిస్టెంట్ నోటిఫికేషన్ 2024ని విడుదల చేసింది.

అర్హతలు

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. అంతేకాక అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిఉండాలి .

వయస్సు

  • 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు 5 సంవత్సరాలు సడలింపు.
  • ఇతర వెనుకబడిన తరగతులు (OBC, నాన్-క్రీమీ లేయర్) 3 సంవత్సరాలు సడలింపు.
  • బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు 10 సంవత్సరాలు సడలింపు.
  • మాజీ సైనికుడు. డిసేబుల్డ్ ఎక్స్-సర్వీస్‌మెన్ రక్షణ దళాలలో అందించిన వాస్తవ సేవా కాలం + 3 సంవత్సరాలు, గరిష్టంగా 45 సంవత్సరాలు.
  • వితంతువులు, విడాకులు పొందిన స్త్రీలు మరియు స్త్రీలు తమ భర్తల నుండి చట్టబద్ధంగా విడిపోయారు, సాధారణ/EWSకి 35 సంవత్సరాల వయస్సు వరకు వయస్సు రాయితీ.
  • OBCకి 38 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 40 సంవత్సరాలు వరకు.
  • కంపెనీలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 5 సంవత్సరాలు సడలింపు.

ఖాలీలు

రాష్ట్రంSCSTOBCEWSURమొత్తం
ఆంధ్ర ప్రదేశ్2721021
అరుణాచల్ ప్రదేశ్11
అస్సాం2272922
బీహార్1910
ఛత్తీస్‌గఢ్251715
గోవా33
గుజరాత్24931230
హర్యానా55
హిమాచల్ ప్రదేశ్123
జార్ఖండ్1121914
కర్ణాటక311242040
కేరళ21131935
మధ్యప్రదేశ్ 0621 0716 
మహారాష్ట్ర631252652 
మణిపూర్101 
మేఘాలయ22
మిజోరం11
నాగాలాండ్11
ఒడిశా231410
రాజస్థాన్31610
పంజాబ్31732135
సిక్కిం11
తమిళనాడు932335
తెలంగాణ1141512
త్రిపుర22
ఉత్తర ప్రదేశ్511016
ఉత్తరాఖండ్321612
పశ్చిమ బెంగాల్1511352458
అండమాన్ & నికోబార్ దీవులు11
చండీగఢ్123
ఢిల్లీ13521728
జమ్మూ & కాశ్మీర్112
లడఖ్13521728
పాండిచ్చేరి22
మొత్తం433311341270500

ఎంపిక విధానం

ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ప్రాంతీయ భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

స్టేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) – ఈ పరీక్ష 100 ప్రశ్నలు.. 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు). పరీక్ష వ్యవధి మాత్రం 60 నిమిషాలు ఉంటుంది. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ – 1/4 కూడా ఉంటుంది.

స్టేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) – ఈ పరీక్ష 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు) పరీక్ష వ్యవధి మాత్రం 120 నిమిషాలు ఉంటుంది. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ – 1/4 కూడా ఉంటుంది.

స్టేజ్ 3- ప్రాంతీయ భాషా పరీక్ష

పరీక్షా కేంద్రాలు

NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ తో పాటు పరీక్షా కేంద్రాల జాబితా కూడా విడుదల చేయబడింది. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు తమకు ఇష్టమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలుసెంటర్ లొకేషన్
ఆంధ్ర ప్రదేశ్విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు
అస్సాంగౌహతి, దిబ్రూగర్, సిల్చార్, జోర్హాట్
అరుణాచల్ ప్రదేశ్నహరియగున్
బీహార్పాట్నా, గయా, భాగల్పూర్
చండీగఢ్చండీగఢ్/మొహాలి
ఢిల్లీ-NCRఢిల్లీ-NCR
గోవాపనాజీ
గుజరాత్/దాద్రా & నగర్ హవేలీ/డామన్ & డయ్యూఅహ్మదాబాద్/గాంధీ నగర్, వడోదర, సూరత్, రాజ్‌కోట్
హర్యానాహిస్సార్, ఫరీదాబాద్, గుర్గావ్
హిమాచల్ ప్రదేశ్సిమ్లా, మండి
జమ్మూ & కాశ్మీర్/లడఖ్శ్రీనగర్, జమ్ము, లేహ్
జార్ఖండ్రాంచీ, జంషెడ్‌పూర్
కర్ణాటకబెంగళూరు, హుబ్లీ/ధార్వాడ్, మంగళూరు, మైసూర్
కేరళఎర్నాకులం/కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్
మధ్యప్రదేశ్భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్
మహారాష్ట్రముంబై/నవీ ముంబై/థానే/MMR, నాగ్‌పూర్, పూణే, ఛత్రపతి శంభాజీ నగర్, నాసిక్
మణిపూర్ఇంఫాల్
మేఘాలయషిల్లాంగ్
మిజోరంఐజ్వాల్
నాగాలాండ్కోహిమా, దిమాపూర్
ఒడిశాభువనేశ్వర్, కటక్, రూర్కీ, బెర్హంపూర్
పుదుచ్చేరిపుదుచ్చేరి
పంజాబ్అమృత్‌సర్, లూథియానా, భటిండా
రాజస్థాన్జైపూర్, జోధ్‌పూర్, బికనీర్
సిక్కింగాంగ్టక్
తమిళనాడుచెన్నై, కోయంబత్తూరు, మధురై
తెలంగాణహైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్
త్రిపురఅగర్తల
ఉత్తర ప్రదేశ్లక్నో, అలహాబాద్ కాన్పూర్ నోయిడా/గ్రేటర్ నోయిడా
ఉత్తరాఖండ్డెహ్రాడూన్, హరిద్వార్, హల్ద్వానీ
పశ్చిమ బెంగాల్కోల్‌కతా/ గ్రేటర్ కోల్‌కతా, సిలిగురి, అసన్సోల్
అండమాన్ & నికోబార్పోర్ట్ బ్లెయిర్

జీతం

నెలకు రూ.22,405- రూ.62,265 ఉంటుంది. ఇది వారికి పోస్టింగ్ ఇవ్వబడిన ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది.

అప్లై చేసే విధానం

దరఖాస్తు ఫీజు: రూ.850.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: అక్టోబర్ 24, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 11, 2024.
దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: అక్టోబర్ 24 నుంచి నవంబర్ 11 వరకు.
ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్ 30, 2024
ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 28, 2024

దరఖాస్తు కొరకు సంప్రదించండి : https://ibpsonline.ibps.in/niclaoct24/

మరిన్ని వివరాలకొరకు NICL ఓఫిషల్ సైట్ https://nationalinsurance.nic.co.in/recruitment సంప్రదించండి

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ జాబ్స్ ని సందర్శించండి

You may also like

Leave a Comment