Home » సిన్నదాని సెంపాకు (Sinnadani Sempaku) సాంగ్ లిరిక్స్ – Folk 

సిన్నదాని సెంపాకు (Sinnadani Sempaku) సాంగ్ లిరిక్స్ – Folk 

by Lakshmi Guradasi
0 comment

సిన్నదాని సెంపాకు సిరి గంధము
అబ్బా సిరి గంధమో
దాని బుగ్గల మీద చూడు ఎంత అందమో
బుగ్గలేంత అందమో

బుగ్గల మీద ఉన్నసుట్ట అందము
బుగ్గ సుట్ట అందము
ఆ సుట్టని ముట్టుకుంటే ఎంత ముద్దునో
నేనెంత ముద్దునో

సిన్నదాని సెంపాకు సిరి గంధము
అబ్బా సిరి గంధమో
దాని బుగ్గల మీద చూడు ఎంత అందమో
బుగ్గలేంత అందమో

నా పిల్లాది ఏసుకున్న రైక అందమో
ముడి రైక అందమో
పూల రైక చూడు ఎరుపు రంగు అందమో
మెరుపు పూత అందమో

ఎర్రని రైకకు బుగ్గ ఎందమో
రైక బుగ్గ అందము
అబ్బా రైక మీద చూడు పిల్ల సిగ్గు అందము
దాని సిగ్గులు అందము

సిన్నదాని సెంపాకు సిరి గంధము
అబ్బా సిరి గంధమో
దాని బుగ్గల మీద చూడు ఎంత అందమో
బుగ్గలేంత అందమో

వెన్నెల వెలుగోలే మొవ్వు సందము
పున్న నవ్వులందమో
దాని కళ్ళకు పెట్టుకున్న కాటుక అందమో
చేప కళ్ళు అందమో

వయ్యారి పూత పూసే నడుము అందమో
దాని నడక అందమో
ఆ నడకల్లో అడుగేస్తూ నేను పొదునో
ఏంటా పడి పోదునో

సిన్నదాని సెంపాకు సిరి గంధము
అబ్బా సిరి గంధమో
దాని బుగ్గల మీద చూడు ఎంత అందమో
బుగ్గలేంత అందమో

ఉంగరాల గుంగురు జుట్టు అందమో
సిగ కొప్పు అందమో
ఆ కొప్పుకు కొండమల్లే పువ్వులందమో
మల్లె పువ్వులందమో
ఆ మల్లెల వాసనకు లేచి ఆడెనో
నా మనసు ఆడెనో
ఆ పిల్ల చెయ్యి పట్టుకొని గంతులేసేనో
పెళ్లి తంతు చేసెనో

సిన్నదాని సెంపాకు సిరి గంధము
అబ్బా సిరి గంధమో
దాని బుగ్గల మీద చూడు ఎంత అందమో
బుగ్గలేంత అందమో

లాయిరే లాయిరే లబ్బారి బొమ్మ
నా లబ్బారి బొమ్మ
లంగా వోణి వేసుకున్న సూపుల బొమ్మ
సోకేసుల బొమ్మ

లాయిరే లాయిరే లబ్బారి బొమ్మ
నా లబ్బారి బొమ్మ
లంగా వోణి వేసుకున్న సూపుల బొమ్మ
సోకేసుల బొమ్మ

____________________________________

పాట: సిన్నదాని సెంపాకు (Sinnadani Sempaku )
సంగీతం: హనీ గణేష్ (Sinnadani Sempaku)
సాహిత్యం: కుమార్ కోట (Kumar Kota)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
తారాగణం : పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar), రాజేష్ జాగూర్ (Rajesh Jagur)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment