Home » నగిరో (Nagiro) సాంగ్ లిరిక్స్ – పొట్టెల్ (Pottel)

నగిరో (Nagiro) సాంగ్ లిరిక్స్ – పొట్టెల్ (Pottel)

by Lakshmi Guradasi
0 comment

మూడు ముళ్ల సాచి నేను
తోడు ఉండి రోజు నిన్ను
నింగి లాగ నే చూడనా
నేల తల్లి సాచి నేను
కాలు కందకుండ నిన్ను
గుండె పరిచి నే మోయనా
చల్ల చల్ల గాలినై
నిన్ను సేదదీర్చన
ఊపిరల్లే నిండుకొని
నిన్ను నడపనా
అల్లుకోని వెచ్చగా
నీతో ముచ్చటించనా
ఉండనా వెంటనే నీడలా

నగిరో నగి నారో
నగిరో నగి నారో
ఒక నువ్వు ఒక నేను
కలిపేస్తే జతరో
నగిరో నగి నారో
నగిరో నగి నారో
నా నువ్వు నీ నేను
మనమే ఒక ఊరో

మూడు ముళ్ల సాచి నేను
తోడు ఉండి రోజు నిన్ను
నింగి లాగ నే చూడనా

వేల చుక్కలన్నీ తేను కానీ
కంట నీటి చుక్క రాలదంట
మేడ మిద్దలేవి లేవు గాని
ఎండ సోకకుండా చూసుకుంటా
కనురెప్పను నేనై
నిన్నే కాస్తుంటా
నా కన్నుల్లోనే నిను దాయన
కదిలా అన్నోదిలా
నేన్ నీదానినంటూ
ఒదిగ నీ ఎదల
నేనే నువ్వంటూ

నగిరో నగి నారో
నగిరో నగి నారో
ఒక నువ్వు ఒక నేను
కలిపేస్తే జతరో
నగిరో నగి నారో
నగిరో నగి నారో
నా నువ్వు నీ నేను
మనమే ఒక ఊరో

మూడు ముళ్ల సాచి నేను
తోడు ఉండి రోజు నిన్ను
నింగి లాగ నే చూడనా

రావు అక్షరాలు లేదు చదువు
నేను నేర్చుకున్న భాష నువ్వు
కాదు లేదు అన్న మాట రాదు
నేను మార్చుకున్న తోవ నువ్వు
నా కలలకు మళ్ళీ ప్రాణం పోసావు
నిను వీడక ఉంటా నీ నీడలా
కనకే నీ వెనకే
నేనున్నాను జతగా
కధకే మన కధకే రూపివ్వగా

నగిరో నగి నారో
నగిరో నగి నారో
ఒక నువ్వు ఒక నేను
కలిపేస్తే జతరో
నగిరో నగి నారో
నగిరో నగి నారో
నా నువ్వు నీ నేను
మనమే ఒక ఊరో

_________________________________________

పాట: నగిరో (Nagiro)
ఆల్బమ్/సినిమా: పొట్టెల్ (Pottel)
ఆర్టిస్ట్ పేరు: యువ చంద్ర కృష్ణ (Yuva Chandraa Krishna), అనన్య నాగళ్ల (Ananya Nagalla)
గానం: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), లాలస.ఆర్ (Lalasa.R)
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర (Shekar Chandra)
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
రచన & దర్శకత్వం: సాహిత్ మోత్ఖురి (Sahit Mothkhuri)
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి (Nishank Reddy Kudithi), సురేష్ కుమార్ సడిగె (Suresh Kumar Sadige)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment