Home » పోరాడు (Poraadu) సాంగ్ లిరిక్స్ – Narudi Brathuku Natana 

పోరాడు (Poraadu) సాంగ్ లిరిక్స్ – Narudi Brathuku Natana 

by Lakshmi Guradasi
0 comment

ఈ… లోకాన ఎందరున్నా
కడదాక నీకు నువ్వే తోడుండాలి..

ఏ… లోపాలు నీలో ఉన్నా
నువు కోరుకున్న వైపే అడుగేయాలి..

నేస్తమంటూ లేరే
ఈ జీవితానికెవరూ
పోరాడకుంటె గెలుపే నీదవదూ…

గాయపడితే మనసూ
సాయాన్ని కోర మాకు
ఆ బాధ లోనే బతుకూ..
నువు నీకు దొరికే వరకూ…

కాలమడిగే ప్రశ్నకే
బదులు నువ్వై సాగిపోరా..
రాని దేదో కాని దేదో
తెలుసుకుంటూ..

ఏది కాదూ శాశ్వతం
మరిచిపోకూ ఈ నిజాన్నీ
ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా
చిల్లిగవ్వా తోడురాదూ

నలుగురి లోనూ
కలిసిపోతూ
నువ్వు నీలా మారు..

జ్ఞాపకాలనే
పోగు చేసే
ఆటే కాదా జీవితమంటే

కన్నులతడే.. నేర్పేను మరి
నువు నడవనీ.. దారే ఏదో..

నీ మౌనమే.. నీ తోడు అని..
గమ్యానికే.. నడిచిపోరా..

పూలు పరిచిన దారే
కావాలి అనుకోమాకూ
ముళ్ళున్న దారి కూడా.. నీదనుకో..

పూటగడవని రోజే
తెలిసేను ఆకలంటే
ఆ రోజు నీకెదురైతే
పుడతావు మళ్ళీ నువ్వే..

వాడూ వీడూ, వీడూ వాడూ
ఎవ్వన్నీ నమ్మొద్దు నువ్వు
తాడో పేడో తేలాలంటే
నీతో నువ్వే పోరాడు..

గుండె పగిలి నెత్తురొస్తె
నొప్పి అంటు మొత్తుకోకు
చిప్పకూడు చేతికొస్తె
నెత్తీనోరూ బాదుకోకు
చావుకోరల్లోన చిక్కి
గద్ద కొత్త జన్మ ఎత్తి
ఆకాశాన్ని ఏలినట్టు
కలల్ని కళ్ళజూడ నువ్వు మారు

పట్టిన పట్టే గట్టిగ పట్టూ
పిడికిలి పిడుగులు కురిపించేట్టూ..
పడుతూ లేస్తూ పంజా విసురూ
మరిగిన నెత్తురు చిందేట్టూ..

విడిపడి ముడిపడి తలపడి బలపడి
నిలబడి కలబడి ఎగబడి తెగబడి
దడవక విడవక గెలుపుని గెలవరా..
ఈ లోకం మూర్ఛిల్లేట్టూ..

నడిచి వెళ్ళే దారిలో..
మనిషి తనమే చల్లిపోరా..
తోటి వాడీ సంబరాన్నే.. పంచుకుంటూ

వీసెడైనా ప్రేమకే
నోచుకోనీ తోటివాన్ని
పురిటిలో పసివాడిమల్లే..
దగ్గరికి నువు తీసుకోరా..

నలుగురి మేలూ కోరిన నాడే
మనిషౌతావూ నీవూ
ఆ సత్యాన్నే గుర్తించాకే
మొదలయ్యేనూ నీలో మార్పూ..

నిన్నటి నువే.. నీకెదురు పడీ..
నువు ఎవరనీ.. అడిగే లాగా..
నీ కథ నువే.. రాయాలి మరి..
ఈ నిమిషమే…‌ తనివి తీరా..

ప్రేమ లేని వాడే..
అసలైన పేదవాడు
ఆ లోటు నీకు ఎపుడూ.. రానివకు..

ప్రేమ స్పర్శ తోనే..
ముగిసేను ప్రశ్నలన్నీ
అది నీకు అనుభవమైతే
పుడతావు మళ్ళీ నువ్వే

__________________________________________________

పాట పేరు: పోరాడు (Poraadu)
గాయకుడు: సీన్ రోల్డాన్ (Sean Roldan)
పాటల మిక్సింగ్: అబిన్ పాల్ (Abin Paul)
కంపోజర్: NYX లోపెజ్ (NYX Lopez)
సాహిత్యం: చిత్రన్ (Chitran)
రాప్: రిషికేశ్వర్ యోగి (Rishikeshwar Yogi)
తారాగణం: శివ కుమార్ రామచంద్రవరపు (Shiva Kumar Ramachandravarapu), నితిన్ ప్రసన్న (Nithin Prasanna),
రచయిత – ఎడిటర్ – దర్శకుడు: రిషికేశ్వర్ యోగి (ishikeshwar Yogi)
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), సుకుమార్ బోరెడ్డి (Sukumar Boreddy), డా.
సింధూ రెడ్డి (Dr. Sindhu Reddy)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment