పొట్టేల్ ని గన్న తల్లి
హెయ్ గొర్రె గొర్రె గొర్రె
దున్నపోతుకు చిన్న చెల్లి
అది బర్రె బర్రె బర్రె
అరె చాపను చూస్తే కొంగ
అహ వెర్రే వెర్రే వెర్రే
కోడిపెట్టెను చూసి పుంజు
హ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్)
బూరెలేసే బుజ్జి పద్మావతి
బంగార్రాజు పులిహార కలిపాడు
పూలు అల్లుతున్న చిట్టి కుమారికి
కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు
ముగ్గులు పెట్టే ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు
మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
ఓ ఓ.. చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
స్వాతిముత్యాలు కొంచెం జాతిరత్నాలు
పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేళ్లు
మీసం మెలేసినా ప్రతి ఒక్క కుర్రాడు
కాటుక కళ్ళే చూసి ఫ్లాటైపోతాడు
గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు
భూమిదున్నాడంటే నమ్మేదెవ్వడు
మూర మల్లెపూలు కొప్పున చుడితే
ఊరూరంతా నిద్దుర లేసింది
బెత్తెడు నడుము అత్తరు కొడితే
పొలిమేర కూడా పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే
కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది
నాయకి
ఓ మరి, నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
చిత్రం:ఆయ్ (AAY)
గాయకులు:అనురాగ్ కులకర్ణి
సాహిత్యం:సురేష్ బనిశెట్టి
సంగీతం:రామ్ మిరియాల
దర్శకత్వం:అంజి కె మణిపుత్ర
తారాగణం:నార్నే నితిన్ మరియు నయన్ సారిక తదితరులు
ఉప్పుప్పు మిరపకాయ్ (AAY Theme Song) సాంగ్ లిరిక్స్ – ఆయ్
మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.