dol dol dol song lyrics mr perfect

డోలు డోలు డోలు బాజే సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

by Vinod G

గల్లు గల్లు మని గజ్జలు ఆడే
జల్లు జల్లు మని గుండెలు పాడే
బల్లు బల్లు మని డమరుకమొగే
జిల్లు జిల్లు మని వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరువాడా హారుమంటూ కదిలి
పండగల్లెయ్ పెళ్లి చేయు సందడులే

డోలు డోలు డోలు బాజే
సంబరాలు షాదీ రోజే
మంతనాలు పెత్తనాలు
చేస్తూ పెద్దవాళ్ళు
వేసే పెళ్లి రూటులే

డోలు డోలు డోలు బాజే
డోలు మీద రాణి రాజే
చందనాలు కంకణాలు మారే
ఉంగరాలు చేరే పెళ్లి పెద్దలే

మేడ్ ఫర్ ఈచ్ అదర్ వీళ్లు మరి
నూరేళ్లు హాయిగా గడపమని
వేదాలు మంత్రాలు వాద్యాలు తాళాలు
నింగి నీల ఏకం చేసీ
క్షణాలు జిగేలుమానాలి లే

గల్లు గల్లు మని గజ్జలు ఆడే
జల్లు జల్లు మని గుండెలు పాడే
బల్లు బల్లు మని డమరుకమొగే
జిల్లు జిల్లు మని వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరువాడా హారుమంటూ కదిలి
పండగల్లెయ్ పెళ్లి చేయు సందడులే

ఓ కొంటెపిల్ల సిగ్గులన్నీ… ఓ ఓ ఓ ఓ
నేల మీద ముగ్గులాయే …ఆ హా హా హా
టింగు రంగు జల్లే పాప కొంగు పట్టి వెళ్ళింది
కళ్ళు కాస్త పైకి ఎత్తదే … అహ

రామసక్కనోడు లెండి …ఓ ఓ ఓ ఓ
బామవంక చూడదండి …ఆ హా హా హా
రాయబార మెందుకండీ రాసి ఉంచి నాడు లెండి
గుండెలోన చోటు సీతకే…

చూపులే మాటలై మారి కవితలు రాయవ
ప్రేమ మరి పెళ్లి లోన ఆటవుతుంది పాటవుతుంది
మన్సులూ కలిపే చోటొస్తుంది.

గల్లు గల్లు మని గజ్జలు ఆడే
జల్లు జల్లు మని గుండెలు పాడే
బల్లు బల్లు మని డమరుకమొగే
జిల్లు జిల్లు మని వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరువాడా హారుమంటూ కదిలి
పండగల్లెయ్ పెళ్లి చేయు సందడులే

కళ్లలోని ఆశలన్నీ …ఓ ఓ ఓ ఓ
నిన్ను చేరి తేలిపోయే ఆ హా హా హా
కోరి కోరుకున్న నాకు తోడు నీడ గుంటనంటూ
ఒట్టు పెట్టి చెప్పావా మరి …ఆహా

హే.. గుండెలోన కోట కట్టి …ఓ హో హో హో
ఊపిరంత నీకు పోసి …ఆ హా హా
అందమైన బొమ్మ చేసి మూడు ముళ్ల మంత్రమేసి
ఏలుకుంట నిన్ను రాణిలా..

నీ జతే ఓ వరం కోటి కళలకు కానుక
లోకమంతా మాయచేసి
నువ్వు నేను మిగిలుండాలి
యుగాలు క్షణాలు అయ్యేట్టుగా

గల్లు గల్లు మని గజ్జలు ఆడే
జల్లు జల్లు మని గుండెలు పాడే
బల్లు బల్లు మని డమరుకమొగే
జిల్లు జిల్లు మని వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరువాడా హారుమంటూ కదిలి
పండగల్లెయ్ పెళ్లి చేయు సందడులే


చిత్రం:  మిస్టర్ పర్ఫెక్ట్ ( Mr Perfect)
పాట పేరు: డోలు డోలు డోలు (Dol Dol Dol)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు: MLR కార్తికేయ (MLR Karthikeyan), అనిత కార్తికేయ (Anitha Karthikeyan)
సాహిత్యం: బాలాజీ (Balaji)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: దశరధ్ (Dasaradh)

చలి చలిగా సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like