Home » రాములో నా రాముల (Ramuloo Na Ramulaa) సాంగ్ లిరిక్స్ – Folk Song

రాములో నా రాముల (Ramuloo Na Ramulaa) సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comments
Ramuloo Na Ramulaa song lyrics Folk

పొద్దు వాలుతుంది
పాణమే నీ మీద
రాములో నా రాముల
యాదికున్నాద ఎనకటి
మన ప్రేమ
రాములో నా రాముల

పొద్దు వాలుతుంది
పాణమే నీ మీద
రాములో నా రాముల
యాదికున్నాద ఎనకటి
మన ప్రేమ
రాములో నా రాముల

చక్కని చందుర మా రాముల
అందాల జాబిలమ్మ
బంధాన్ని మరవకమ్మ
దరికి అందవే పులకొమ్మ

పొద్దు వాలుతుంది
అరెరే పొద్దు వాలుతుంది
హేయ్ పొద్దు వాలుతుంది
పాణమే నీ మీద
రాములో నా రాముల
యాదికున్నాద ఎనకటి
మన ప్రేమ
రాములో నా రాముల

జోడు జోడు బండ్లు కడితినే పిల్లో
జోడుగాళ్లన నా బండే
ఈడు జోడు బాగా కుదిరెనే పిల్లో
ఈడు జోడుగళ్ళ జంటే

జోడు జోడు బండ్లు కడితినే పిల్లో
జోడుగాళ్లన నా బండే
ఈడు జోడు బాగా కుదిరెనే పిల్లో
ఈడు జోడుగళ్ళ జంటే
కుడి ఉన్న రోజు ఎడమయే
గోవు కూడా గూడు పెట్టదాయె

పొద్దు వాలుతుంది
పాణమే నీ మీద
రాములో నా రాముల
యాదికున్నాద ఎనకటి
మన ప్రేమ
రాములో నా రాముల

పొద్దు పొద్దుగాల కల్లోకోస్తి పిల్ల
కంట నీరు చెమ్మ గిల్లె
ముద్దు ముద్దు మాటలేన్ని చెప్పినవో
గుర్తుకొస్తే గుండె నీళ్ళే

పొద్దు పొద్దుగాల కల్లోకోస్తి పిల్ల
కంట నీరు చెమ్మ గిల్లె
ముద్దు ముద్దు మాటలేన్ని చెప్పినవో
గుర్తుకొస్తే గుండె నీళ్ళే
ముద్దు ముద్దు మాటలు ఎడపాయె
మాటరాక గొంతు మూగబోయే

పొద్దు వాలుతుంది
పాణమే నీ మీద
రాములో నా రాముల
యాదికున్నాద ఎనకటి
మన ప్రేమ
రాములో నా రాముల

గుచ్చి గుచ్చి పచ్చబొట్టు వేసుకున్న
ఈ చేతి మీదన ప్రేమే
మచ్చ లేని మన ప్రేమలోన
ఎవ్వడు చిచ్చు పెట్టినాడే

గుచ్చి గుచ్చి పచ్చబొట్టు వేసుకున్న
ఈ చేతి మీదన ప్రేమే
మచ్చ లేని మన ప్రేమలోన
ఎవ్వడు చిచ్చు పెట్టినాడే
దేవుడన్న జర్ర చెప్పడాయే
కక్షబట్టి ప్రేమ ఈడ్చగొట్టే

పొద్దు వాలుతుంది
పాణమే నీ మీద
రాములో నా రాముల
యాదికున్నాద ఎనకటి
మన ప్రేమ
రాములో నా రాముల

______________________________________

పాట: రాములో నా రాముల (Ramuloo Na Ramulaa)
సాహిత్యం: కొర్ర కిట్టు నాయక్ (Korra Kittu Naik)
సంగీతం : కృష్ణుడు (Krishnudu)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
తారాగణం : కార్తీక్ రెడ్డి (Karthik Reddy) & లాస్య స్మైలీ (Lasya Smiley )

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.