Home » Vivo అభిమానులకు శుభవార్త: ఒకేసారి నాలుగు కొత్త మోడల్స్

Vivo అభిమానులకు శుభవార్త: ఒకేసారి నాలుగు కొత్త మోడల్స్

by Vinod G
552 views
upcoming vivo smartphones

హాయ్ తెలుగు రీడర్స్ ! మంచి మొబైల్ కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారా ? ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మొబైల్స్ మోడల్స్ మీకు నచ్చలేదా అయితే సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ప్రముఖ మొబైల్ సంస్థ వివో (Vivo) నుండి కొత్త మోడల్స్ రాబోతున్నాయి. ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్ సంస్థ Vivo కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వివో (Vivo) అభిమానులు ఈ కొత్త మోడల్స్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈసారి Vivo నాలుగు వినూత్న మోడల్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది: అవి Vivo X 200, Vivo X 200 Pro Mini, Vivo X 200 Pro మరియు Vivo X 200 Ultra.

upcoming vivo smartphones

ఈ కొత్త X 200 సిరీస్ ను ఈ సంవత్సరం డిసెంబర్‌ చివరి నాటికి లేదా కొత్త సంవత్సరం మొదటి నెలలో మార్కెట్‌లోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మోడల్‌లలో ప్రతి ఒక్కటి ప్రస్తుత అత్యాధునిక సాంకేతికతను మరియు మెరుగైన ఫీచర్లను తీసుకువస్తుంది, వివిధ వినియోగదారు ప్రాధాన్యతలు మరియు అవసరాలను అనుగుణంగా వీటిని తీర్చి దిద్దినట్టు సంస్థ తెలియజేసింది. అయితే ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ఈ మోడల్స్ అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి వీటిలో ఏ మోడల్ మన ఇండియాలో ప్రజలకు చేరువవుతుందో చూడాలి.

upcoming vivo smartphones

అయితే ఇప్పటికే Vivo X 100 సిరీస్ మోడల్స్ వివో ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎప్పటిలాగే, శైలి, పనితీరు మరియు ఆవిష్కరణలను మిళితం చేసే అధిక-నాణ్యత స్మార్ట్‌ఫోన్‌లను అందించడానికి Vivo సిద్ధంగా ఉంది. ఈ రాబోయే విడుదలల కోసం ఒక కన్ను వేసి ఉంచండి—అవి మీకు సరైన ఎంపిక కావచ్చేమో!

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.