సిన్నంగా పోయేటి ఓ చిన్నదాన
చూడవే నన్ను ఒక్కసారి
నలుగురు చూస్తారు నా వెంట రాకు
వెళిపోవయ్యా ఓ చిన్నవాడా
వాలుజడ వయ్యారము గట్ట తిప్పకే
పోయే నా పాణము
అల్లరి మాటలు చాలు రా
ఆపు నేనేమి మురిసిపోనురా
మాటలు చెప్పే వాడ్ని కాదే
మనసారా నిన్నే కోరుకున్నానే
గువ్వా గోరింక లా కలిసుందాము
రాయే ఓ పిల్ల
కలకాలం తోడుంటావా ఓ బావ
నీ ఏంటా నేనొస్తారా
నువ్వు మూసి మూసి నవ్వులు
నవ్వుతుండంగా ముత్యాలు రాలయే ఓ పిల్ల
ముత్యాలు రాలంగా నువ్వొచ్చి
రంగ అంగడి లోన అమ్ముకో పిల్లగా
అమ్మోమో నీ చిలిపి మాటలు
గుండెల్లో రేపేనే ఆశలు
చాలులే ఓ పిల్లగా వేషాలు
చూస్తూనే ఉంటాను ఇన్నేళ్లు
కలకాలము మనము కలిసుందామె
ఏలుబట్టవే ఓ చిన్నదాన
గువ్వా గోరింక లా కలిసుందాము
రాయే ఓ పిల్ల
కలకాలం తోడుంటావా ఓ బావ
నీ ఏంటా నేనొస్తారా
చందమామ చూస్తే సిగ్గు పడతాదే
గంత అందము నీదే పిల్ల
నీ మాటలు కోటలు దాటుతున్నాయి
నేను పడనులే ఓరోరి పిల్లగా
అబ్బా నుదుటున కుంకుమ బొట్టు
నీ కళ్ళకు నల్లని కట్టుక
సింధూరపు రంగు చీర
రాతిరిని తలపించే రైక
కట్టుకోని నువ్వు నడిచొస్తావుంటే
రెండు కళ్ళు చాల్లవే చందమామ
గువ్వా గోరింక లా కలిసుందాము
రాయే ఓ పిల్ల
ఆమె: కలకాలం తోడుంటావా ఓ బావ
నీ ఏంటా నేనొస్తారా
___________________________________
పాట : గువ్వ గోరింక (Guvva Gorinka)
సాహిత్యం: సిద్దూ యాదవ్ (Siddu Yadav)
గాయకులు: సుమన్ బద్నకల్ (Suman Badnakal) – శ్రీనిధి (Srinidhi)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
దర్శకత్వం: సందీప్ నిర్వాన్ (Sandeep Nirvan)
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకుతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.