Home » గర్వభంగం – కథ

గర్వభంగం – కథ

by Haseena SK
0 comment

ఒక అడవిలో వేప చెట్టు ఉండేది. ఒక చెట్టు విశాలమైన కొమ్మలతో ఎంత పెద్దదిగా ఉండేది మరోకటి బుజ్జి బుజ్జి కొమ్మలతో చిన్నదిగా ఉండేది. పేద వేప చెట్టుకు తాను పెద్దగా ఉన్నానని గర్వం వచ్చింది. అందుకే ఎవర్నీ దగ్గరకు రానిచ్చేది కాదు పక్షులు గూడ కట్టుకోవడానికి వస్తే కొమ్మలను బలంగా ఊపి వాటిని భయపెట్టి వెళ్లె గొట్టేది తన నీడలో జంతువులను కూడా నింపనిచ్చేది కాదు

చిన్న వేప చెట్టు అలా కాదు అందరికీ ఆశ్రయం ఇచ్చేది. దాని కొమ్ములో పక్షులు గూళ్ళ కట్టుకున్నాయి తీనెటీగలు తీనెతుట్టెను పెట్టాయి. ఎండగా ఉన్నప్పుడుఎన్నో జంతువులు ఆ చెట్టు నీడలో సేదతీరేవి.

ఒక రోజూ కొంతమంది వడ్రంగులు కలప కోసం ఆ అడవిలోకి వచ్చారు. పక్కపక్కనే ఉన్న రెండు చెట్లను పరిశీలించడం మొదలు పెట్టాడు. ముందగా చిన్న చెట్టు దగ్గరకు వెళ్లారు పక్షుల గూళ్ళలోంచి బుజ్జి పక్షుల కిలకిలలు విన్నారు కొమ్మలమీద ఆడుకుంటున్నా ఉడతలను చెట్టు చుట్టూ గెంతులు వేస్తున్న కుందేళ్ళను చూశారు వడ్రంగులకు అక్కడి వాతావరణం ఎంత సుందరంగ పండుగా అనిపిస్తుంది దానితో వారికిಆ చిన్న చెట్టుకు కొట్టు డానికి మనసు రాలేదు.

అక్కడి నుంచి పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళారు. పెద్ద పెద్ద కొమ్మలతో విస్తరించి ఉన్న చెట్టు దగ్గర ఇతర జీవుల జాడ కనిపించలేదు వండ్రుగులు ఒక్క క్షణం కూడా ఆలోంచకుండా పెద్ద చెట్టును గొడ్డళ్ళతో నరికి కలపను తీసుకు వెళ్లారు. అహంకారంతో చెట్టు భాద పండింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment