Home » కొత్తగా పెళ్లాయే ఎంకటి (Kothaga Pellaye Enkati) సాంగ్ లిరిక్స్ – Folk song

కొత్తగా పెళ్లాయే ఎంకటి (Kothaga Pellaye Enkati) సాంగ్ లిరిక్స్ – Folk song

by Lakshmi Guradasi
0 comments
Kothaga Pellaye Enkati song lyrics Folk

కొత్తగా పెళ్లాయే ఎంకటి

కొత్తగా పెళ్లాయే ఎంకటి
ఏడ పోయినవ్ పెనిమిటి

కొత్తగా పెళ్లాయే ఎంకటి
ఏడ పోయినవ్ పెనిమిటి
ఇడవలేనంత సోపతి
కముకొచ్చే చీకటి
నిన్ను ఇడవలేనంత సోపతి
కముకొచ్చే చీకటి

అరె ఆగరాదె నా శ్రీమతి
ఊరిలో పెద్ద మనిషిని
ఆగరాదె నా శ్రీమతి
ఊరిలో పెద్ద మనిషిని

చిన్నోని పెద్దొని కయ్యమిని
తీర్పన్న ఇయ్యబోతిని
చిన్నోని పెద్దొని కయ్యమిని
తీర్పన్న ఇయ్యబోతిని

తీర్పు తీర్చే పెద్ద మనిషివయ్య
అత్తర వాసన చెప్పనా బట్టే
గుప్పు గుప్పునా గుమ్మనబట్టే
ఏడికెళినవ్ తెల్వనేబట్టే

నీ వంకర మాటలు వద్దులే పిల్లో
సూటిగా చెప్పే వున్నది ఏందో
చిర్రు బుర్రున అడనవద్దు
చేతికి పని చెప్పనేవద్దు

నీ గత్తరు చక్కన ఎంకటి
అత్తరు వాసన ఏడాది
నీ గత్తరు చక్కన ఎంకటి
అత్తరు వాసన ఏడాది
తాకలేదా ఏ ఆడది
ఈ సెంటువాసన ఆడోలది
నిన్ను తాకలేదా ఏ ఆడది
ఈ సెంటువాసన ఆడోలది

అరె చిన్నోడిని పెద్దోడ్ని కొట్టగా
కట్ట తాకే పూల చెట్టిగా
చిన్నోడిని పెద్దోడ్ని కొట్టగా
కట్ట తాకే పూల చెట్టిగా
అల్లి బుల్లు రాలే అంగీమీద
వాసనొత్తే చాలు ఆడదేనా
అల్లి బుల్లు రాలే అంగీమీద
వాసనొత్తే చాలు ఆడదేనా

కొత్తగా పెళ్లాయే ఎంకటి
ఏడ పోయినవ్ పెనిమిటి

కొత్తగా పెళ్లాయే ఎంకటి
ఏడ పోయినవ్ పెనిమిటి
ఇడవలేనంత సోపతి
కముకొచ్చే చీకటి
నిన్ను ఇడవలేనంత సోపతి
కముకొచ్చే చీకటి

నీ నెత్తికి రుమాలు చెప్పనబట్టే
గణకార్యోమేదో చేసిరాబట్టే
ఇంట్లోకైతే రానే రాకయ్యో
జౌడమైన సరే బావయ్యో

ఎహే వెక్కిరి చేష్టలు పక్కన పెట్టి
సక్కగా చెప్పి నొక్కులు ఆపి
ఇంట కూసుండి నన్నే రాకంటే
ఇంటి పక్కనోళ్లు నవ్వనబట్టే

నీ నెత్తికి రుమాలు ఎంకటి
ఏడ విప్పినవ్ పెనిమిటి
నెత్తికి రుమాలు ఎంకటి
ఏడ విప్పినవ్ పెనిమిటి

పల్లేరుకాయలు అంటుకుని
గడ్డి పరక సుట్టు సుట్టుకుని
పల్లేరుకాయలు అంటుకుని
గడ్డి పరక సుట్టు సుట్టుకుని

కట్ట కింది ఎంకటమ్మకి
కట్టల మోపు ఎత్తితి
కట్ట కింది ఎంకటమ్మకి
కట్టల మోపు ఎత్తితి

మోపు ఎత్తంగా కింద పడి
రుమాలు మాపు అంటుకున్నది
మోపు ఎత్తంగా కింద పడి
రుమాలు మాపు అంటుకున్నది

కొత్తగా పెళ్లాయే ఎంకటి
ఏడ పోయినవ్ పెనిమిటి

కొత్తగా పెళ్లాయే ఎంకటి
ఏడ పోయినవ్ పెనిమిటి
ఇడవలేనంత సోపతి
కముకొచ్చే చీకటి
నిన్ను ఇడవలేనంత సోపతి
కముకొచ్చే చీకటి

నీ చేతిలో సెల్లు మోగనబట్టే
బూర్ బుర్రున ఉర్కనాబట్టే
రాతిరైనా రానే రావయ్యో
రసలిలంతా ఏడయ్యో

మంచి చెడ్డ మాటలాడనబట్టే
కట్టలు కట్టలు తేనే తేబట్టే
పట్టుకొచ్చినాయి తీసుకోని
నిందలేసినవే ఏమి పని

ఇంకా నీకు నాకు కలవది
ఇడిసిపోవే శ్రీమతి
నీకు నాకు కలవది
ఇడిసిపోవే శ్రీమతి

నీ ఇంటికాడ నిన్ను ఇడిసిపెట్టి
నా బువ్వ చూసుకుంటా మనసు పెట్టి
నీ ఇంటికాడ నిన్ను ఇడిసిపెట్టి
నా బువ్వ చూసుకుంటా మనసు పెట్టి

అందగాడివయ్య ఎంకటి
అనుమనబడితి పెనిమిటి
నువ్ అందగాడివయ్య ఎంకటి
అనుమనబడితి పెనిమిటి

బాధపెట్టనోయ్ పెనిమిటి
నీ మీద ఒట్టు నే పెడితిని
ఇక బాధపెట్టనోయ్ పెనిమిటి
నీ మీద ఒట్టు నేను పెడితిని

________________________________________

పాట: కొత్తగా పెళ్లాయే ఎంకటి (Kothaga Pellaye Enkati)
గాయకులు: మంజుల యాదవ్ (Manjula Yadav), వోడ్లకొండ అనిల్ కుమార్ (Vodlakonda anil Kumar)
సాహిత్యం: భాస్కర్ మంగారై (Bhaskar mangarai),
సంగీతం: మోహన్ మిక్కీ (Mohan mikky),
నటీనటులు: నీతు క్వీన్ (Nithu queen), గిరిధర్ (Giridhar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.