Home » నీలో నాలో (Neelo Naalo) సాంగ్ లిరిక్స్ – స్వాగ్ (Swag)

నీలో నాలో (Neelo Naalo) సాంగ్ లిరిక్స్ – స్వాగ్ (Swag)

by Lakshmi Guradasi
0 comments
Neelo Naalo song lyrics Swag

నీలో నాలో
కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం

నీలో నాలో
కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం

తమకపు తీరాలలో
పెదవుల సయ్యాటలో
తరగని శృంగారమే
తెరిచిన సౌధాలలో
రేపటి కలనే చెలియా కందామా…
కమ్మని కబురే జతగా విందామా..

నీలో నాలో
కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం

కలల జడి నేను
కావేరి నువ్వు
ఓ ప్రణయ తీరం సాకారమే
కువకువల గువ్వ
గోరింక లాగా
మనము ఒకటైతే
నవ లోకమే

వేకువై నేనుంటా నీవెంట ప్రేమ
వెన్నెలై నను చేరి అలరించరావా
గాలులను ఎదిరించె కొండవలే నేనుంట
ఒదిగిపో వెచ్చగా
గుండెలో.. (గుండెలో)

నీలో నాలో
కదలాడు భావమీరాగం
లోలో ఎదలో వినిపించ సాగే ఓ తాళం

తనదైన తీరం
పెను దూరమైతే
సుడిలోని నావా సాగేదెలా… ఆఆఆ..
వలచి వలపించే ప్రియమైన గీతం
ఎదకు ఎడమైతే నిలిచేదెలా

వెన్నెలను మింగేసే మేఘాల మొహం
వేకువను కప్పేసే మోహాల దాహం
ఉల్కలే ఉప్పెనగా రాలేటి గగనాన
నవ్వులే పువ్వులై విరియునా…(విరియునా)

__________________________________________

పాట పేరు: నీలో నాలో (Neelo Naalo)
చిత్రం: స్వాగ్ (Swag)
సంగీతం: వివేక్ సాగర్ (Vivek Sagar)
సాహిత్యం: భువన చంద్ర (Bhuvana Chandra)
గాయకులు: రాజేష్ కృష్ణన్ (Rajesh Krishnan) & అంజనా సౌమ్య (Anjana Sowmya)
నటీనటులు: శ్రీవిష్ణు (Sree Vishnu), మీరా జాస్మిన్ (Meera Jasmine’s), రీతూ వర్మ (Ritu Varma)
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్ (T.G. Vishwa Prasad)
రచన మరియు దర్శకత్వం: హసిత్ గోలి (Hasith Goli)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.