Home » గుడ్డిగా అనుసరించడం మంచి కాదు – కథ

గుడ్డిగా అనుసరించడం మంచి కాదు – కథ

by Haseena SK
0 comment

ఒక రోజు ఒక సన్యాసి తమ శిష్యులను వెంటబెట్టుకుని ఏటో బయలుదేరాడు దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేప తో సహా ఆ నీళ్లును నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసిళ్లు తీసుకున్నాడు. శిష్యులూ తమ గురువు చేసినట్టు చేశారు. కాని గరువు ఏమీ అనకుండా ముందుకు వెళ్లిపోయాడు. 

అలా వెళుతుండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలో లేవు అప్పుడు గురువు గారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒకొక్కక్కటి బయటికి తీసి చెరువులో వేయడం మొదలు పెట్టాడు. శిష్యులు ఇది చూశారు వారు అలా చేయడానికి ప్రయత్నించారు చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటికి తీసుకురాగలిగారు. 

అప్పుడు గురువు ఇలా అన్నాడు ఓరి బుద్దిహీనుల్లారా కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేతకాలేదా అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు. అందుకే అన్నారు దేన్నీ గుడ్డిగా అనుసరించరాదు అని.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment