Home » ఆటో డ్రైవర్ నిజాయితీ – నీతి కథ

ఆటో డ్రైవర్ నిజాయితీ – నీతి కథ

by Rahila SK
0 comment

ఒక పట్టణములో సురేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె మరియు ఒక కొడుకు ఉన్నారు. సంపాదన చాలక చాలా అవస్థలు పడుతుండేవారు. తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే ఉండేది. అయినా వాళ్లు నీతి తప్పక వచ్చే సంపాదనతో తృప్తిగా జీవిస్తున్నారు. ఒక రోజున సురేష్ ఆటోలో ఇద్దరు దంపతులు గాంధీనగర్‌ స్టేషన్ నుండి ఎక్కారు. వారు ధనవంతులు. నగలుగల బ్యాగ్ ఆటో వెనుక భాగములో పెట్టి దిగిపోయారు. ఇంటికి వచ్చి సురేష్ భోజనము చేస్తుండగా కూతురు ఆటో ఎక్కి ఆడుకుంటూ ఆ బ్యాగ్‌ను చూసి ఇంట్లోలోకి తెచ్చింది. బ్యాగ్‌లో తినే ఆహారపదార్థములేమైనా వున్నాయేమో అని జిప్ తీసి చూస్తే దాంట్లో బంగారు ఆభరణాలు మరియు డబ్బు వున్నాయి. వెంటనే సురేష్ తల్లిదండ్రులకి చెప్పాడు.

సురేష్ వెంటనే భోజనము ముగించుకొని పోలీస్ స్టేషన్‌ వద్దకు వెళ్ళి బ్యాగ్ విషయము పోలీస్ లకు చెప్పి, ఆ దంపతుల ఇంటి గుర్తులు చెప్పాడు. పోలీస్ సురేష్ తో కలిసి ఆ ఇంటికి వెళ్ళి విషయము చెప్పగా, వారు ఈ బ్యాగ్ తమదేనని ప్రయాణ సమయంలో గమనించలేదని చెప్పారు, ఆటో డ్రైవర్ నిజాయితీకి సంతసించి పదివేల రూపాయలు ఇచ్చి, తమ పిల్లల్ని రోజూ ఆటోలో స్కూల్ కి తీసుకొని వెళితే నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా చేసి తన సంపాదన పెంచుకున్నాడు సురేష్. అంతేగాక ఆ వీధిలోని పిల్లల్ని తీసుకెళ్ళి తన సంపాదన పెంచుకొని తన తల్లి ఆరోగ్యము బాగు చేయించుకొని భార్య బీదలతో శాంతోషంగా ఉన్నాడు.

నీతి: ఇలాంటి నిజాయితీ మరియు నీతి ఉన్న ఆటో డ్రైవర్‌కు సమాజంలో విశ్వాసం, గౌరవం లభిస్తాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment