Home » నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే మెదడు చురుకుగా ఉంటుంది

నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే మెదడు చురుకుగా ఉంటుంది

by Rahila SK
0 comment

నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడం, మెదడు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ క్రింది సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

  • పజిల్ లేదా క్రాస్వర్డ్: నిద్రపోయే ముందు ఈ రకమైన ఆటలు మీ మెదడుకు మంచి ప్రేరణను ఇస్తాయి. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు నిద్ర పడుతుంది.
  • మానసిక అంకగణితం: కాలిక్యులేటర్ ఉపయోగించకుండా అంకెలను మానసికంగా లెక్కించడం.
  • పుస్తకాలు చదవడం: నిద్రపోయే ముందు కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా మీ జ్ఞాపకశక్తిని పెంచండి, మరియు నిద్ర కూడా వేగంగా పడుతుంది.
  • మైండ్ స్ట్రెచింగ్ గేమ్స్: చెస్ లేదా కంప్యూటర్ గేమ్స్ వంటి ఆటలు మీ మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయి.
  • శ్వాస తీసుకోవడం: నిద్రపోయే ముందు కాసేపు ధ్యానం చేసి శ్వాస మీదే ద్రుష్టి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.
  • యోగా: నిద్రపోయే ముందు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామలు చేయొచ్చు. కాళ్లను గోడకు ఆనించి పదుకోవడం, తలను కింద ఉంచి కళ్ళు నిటారుగా పెట్టడం. చైల్డ్, క్యాట్ పోజ్ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
  • డైరీ: నిద్రపోయే ముందు డైరీని రాయడం కూడా మంచి అలవాటే. దీని వల్ల రోజులో జరిగిన విషయాలు, పొరపాట్లు గుర్తుకు చేసుకుంటారు. మరుసటి రోజు ఆలా జరగకుండా చూసుకోవచ్చు.
  • స్నేహితులని కలవండి: వీకెండ్ లో నచ్చిన మీకు ఇష్టమైన స్నేహితులతో సరదాగా కాసేపు సమయాన్ని గడపండి. దీనివల్ల ఒత్తడి తగ్గుతుంది. ఉత్సాహంగా తిరిగి పని చేయగలుగుతారు.
  • ఇవి కూడా: మీ మెదడు చురుగ్గా పని చేయాలంటే ఈ అలవాట్లతో పాటు మంచి ఆహారాన్ని శేరీరానికి అందించాలి. అక్రోట్లను, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు డైట్లో భాగం చేసుకోవాలి.
  • శారీరక వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం లేదా జాగింగ్ చేయడం. ఇంటి పనులు, తోటపని వంటి శారీరక కృషి కూడా మెదడుకు మంచిది.
  • ఆహారంలో పోషకాలను చేర్చండి: ఆకుకూరలు, పండ్లు, మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడుకు మంచివి. అధిక కొవ్వు ఆహారాలను నివారించండి: పిజ్జా, బర్గర్లు వంటి ఆహారాలు మెదడు పనితీరును తగ్గించవచ్చు.
  • సూర్యకాంతి: రోజుకు 15-20 నిమిషాలు సూర్యరశ్మికి గురికావడం సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
  • మంచి నిద్రప్రతి: రాత్రి 7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర సమయంలో, మెదడు శరీరం నుండి విషాలను తొలగిస్తుంది మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఈ సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నిద్రపోయే ముందు చురుకుగా ఉండటానికి సహాయపడతాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment