Home » మొక్కై వంగ నిది మానై వంగునా – నీతి కథ

మొక్కై వంగ నిది మానై వంగునా – నీతి కథ

by Haseena SK
0 comment

చిక్కాపురం ఊరిలో ఒక జంట తమ10 ఏళ్ల కుమారుడితో కలసి జీవించేవారు. వాళ్ల కుమారుడు ప్రతి రోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు చిరుతిళ్లకోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజురోజుకూ అతడు డబ్బులు ఇస్తే గాని స్కూలుకు వెళ్లనని మారాం చేయడంతో విసుకు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒక రోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకుని వచ్చింది. ఒక రోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చెయ్యడని అతడితో గొడవపడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పకాదని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటుపడి చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. ఒక రోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకోపోతుంటే లబోదిబోమని భాద పడ్డారు మొదటి సారి చేసినప్పుడే గట్టిగా మందలించి ఉండే సరిపోమేది కదా అని బాధ పడ్డారు.

నీతి :పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గం పెంచాలి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.


You may also like

Leave a Comment