ముమ్మిడివరం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉన్నాడు. అతడు గొప్పదయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలున్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరికోసి కుప్ప వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తైంది. ఇంటికీ బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్లిపోవడం గమనించాడు. అంతే వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత నిర్ణయానికి వచ్చాడు కష్టించి పండించిన తన వరికప్పులకు నిప్పు పెట్టాడు. అది గమనించిన చుట్టుపక్కన వాళ్లు కింది పొలాల వారు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చిరాకాసి అలలు ఎగిసిపడి కొండ కింద బాగాన్ని ముంచెత్తింది తన పంటను నష్టపోయి మరీ తమ ప్రాణాలు కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు.
నీతి కథ : మంచి మనసున్న వాళ్ల తమకు నష్టం జరిగినా పది మందికి మేలు జరగాలనుకుంటారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.