Home » మీ క్షేమం కోసం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఫిట్‌నెస్ ట్రాకర్లు… 

మీ క్షేమం కోసం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఫిట్‌నెస్ ట్రాకర్లు… 

by Lakshmi Guradasi
0 comments
Best Fitbit wrist bands

మీరు మీ ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ని పర్యవేక్షించడానికి ఉత్తమమైన ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్‌లు. ఫిట్‌నెస్ ట్రాకర్లు చిన్న పిల్లల దెగర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉపయోగపడే వాచ్ విధంగా ఉండే పరికరాలు. ఇవి ఆడవారు ఇంట్లో పనిచేసేటప్పుడు ఇవి ధరించి పని చేస్తే ఏంత వరకు క్యాలరీస్ అయ్యాయో, ఎంత వాటర్ తాగేమో, ఎంత గుండె శాతం కొట్టుకుందో, ఎంత ఒత్తిడి తీసుకున్నామో అనేది తెలుసుకోవచ్చు. వయసులో పెద్దవారు కూడా మార్నింగ్ వాకింగ్ చేసేటపుడు ఇవి ధరిస్తే ఎన్ని అడుగులు నడిచామో తెలుసుకోవచ్చు. ఇలా చాలా ఉపయోగములు ఉన్నాయి ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ల వల్ల. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్లు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని చూద్దాం.

Fitbit Luxe – ఇది 24/7 హృదయ స్పందన పర్యవేక్షణను తెలియజేస్తుంది ఫిట్ బిట్ లక్స్ చూసేందుకు అందంగా ఉండడమే కాకుండా ఆరోగ్యం మరియు క్షేమం వంటి రెండు విషయాలను దాని పని తీరును చూపుతుంది. నిద్ర సమయాలు, ఒత్తిడి నిర్వహణ వంటి విషయాలను చురుగ్గా అందిస్తుంది. మీరు మీ ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలంటే ఇది సరైనది.

Fitbit Sense 2 – ఇది ఆధునిక GPS మరియు ECG వంటి పద్ధతులను కలిగి ఉండడమే కాకుండా చర్మ ఉష్ణోగ్రత, ఒత్తిడి నిర్వహణ వంటి వాటిని కూడా తెలియజేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ వంటి పనులను కూడా చేయగలదు. అంటే ఉదాహరణకు హృదయ స్పందనను గూర్చి అడిగితే మనం దాని వైపు చూసే పనిలేకుండా అదే వాయిస్ రూపంలో మనకు తెలియజేస్తుంది. ఇన్ని ఉపయోగాలను అందించే ప్రీమియం Fitbit మోడల్ ను ఒదులుకోకండి.

Fitbit ఛార్జ్ 6 – GPS తో నిర్మితమైన ఆధునిక ట్రాకర్ ల లో ఇది ఒకటి. ఇది మీ హృదయ స్పందన( (హార్ట్ రేట్ ) పర్యవేక్షణ చేయడంలో చాలా బాగా ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా మీరు ఎంత ఒత్తిడికి గురి అవుతున్నారో అనేది కూడా తెలియజేస్తుంది. ఇంకా వ్యాయామాలు, అడుగులు, నిద్ర, టైం ను కొలుస్తుంది.

మరిన్ని ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన విషయాల కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.