కొండకోసుకు ఇంటికేసి
కొండబాలము సూపించేటి
దండి మొగోడివా
సిట్టేడంతా యేలు మీద
పట్టనట్టి పర్వతాన్ని
నిలబెట్టే దేవుడివా
కొండకోసుకు ఇంటికేసి
కొండబాలము సూపించేటి
దండి మొగోడివా
సిట్టేడంతా యేలు మీద
పట్టనట్టి పర్వతాన్ని
నిలబెట్టే దేవుడివా
సంద్రమంతా లోతులోనే
ముంత తోటి కొలిసేటి
మొండి మాగోడివా
నీళ్ల మీద సేద్దరేసి
పూల బరిగే చేత బట్టి
కొట్లాడే తురుంఖానువా
ఇడ్సి కొడితే పడతావురా రామలింగా
అరే ఇపు పగిలి బొబ్బలెక్కు రామలింగా
ఇడ్సి కొడితే పడతావురా రామలింగా
అరేయ్ ఇపు పగిలి బొబ్బలెక్కు రామలింగా
పిలగా పిలగా ఓ పిలగా పిలగా
పైలం పైలం జర పైలం పైలం
గోళం గోళం భూగోళం
యమ గందరగోళం
లోకం లోకం ఈ లోకం
అంతే సిక్కని కల్లోలం
పిలగా పిలగా ఓ పిలగా పిలగా
పైలం పైలం జర పైలం పైలం
గోళం గోళం భూగోళం
యమ గందరగోళం
లోకం లోకం ఈ లోకం
అంతే సిక్కని కల్లోలం
ఇరగా మరగా మదమెక్కిన అధికారం
ఉత్త జనం మీద ఇల్లా ఈరాంగం
సర్కారీ ఆఫీసర్ లా దర్కరి లెక్కలు
పనిబడి ప్రజాలంటే
తిప్పుడే తిప్పలు
అరుపులే సెపులు
పనిబడి ప్రజాలంటే
తిప్పుడే తిప్పలు
అరుపులే సెపులు
బరిగీసిన మనుషులు
బరబరి మోసాలు
నక్క జిత్తుల ఆటలు
వంకర టింకర మాటలు
పైకి సూడు మెరుగులు
అరే లోన సూడు పురుగులు
ప్రపంచమే బహు జూట
లాఫంగా వేషములాట
ప్రపంచమే బహు జూట
లాఫంగా వేషములాట
ప్రపంచమే బహు జూట
లాఫంగా వేషములాట
పిలగా పిలగా ఓ పిలగా పిలగా
పైలం పైలం జర పైలం పైలం
గోళం గోళం భూగోళం
యమ గందరగోళం
లోకం లోకం ఈ లోకం
అంతే సిక్కని కల్లోలం
ఇడ్సి కొడితే పడతావురా రామలింగా
అరే ఇపు పగిలి బొబ్బలెక్కు రామలింగా
పిలగా పిలగా ఓ పిలగా పిలగా
పైలం పైలం జర పైలం పైలం
గోళం గోళం భూగోళం
యమ గందరగోళం
లోకం లోకం ఈ లోకం
అంతే సిక్కని కల్లోలం
______________________________
సినిమా పేరు: పైలం పిలగా (Pailam Pilaga)
పాట: పిలగా పిలగా (Pilaga Pilaga)
ఆల్బమ్/సినిమా: పైలం పిలగా (Pailam Pilaga)
ఆర్టిస్ట్ పేరు: సాయి తేజ కల్వకోట ( Sai Teja Kalvakota), పావని కరణం (Pavani Karanam)
గానం: యశ్వంత్ నాగ్ (Yashwanth Nag) & శ్రావణ భార్గవి (Sravana Bhargavi)
సంగీత దర్శకుడు: యశ్వంత్ నాగ్ (Yashwanth Nag)
గీతరచయిత: అక్కల చంద్రమౌళి (Akkala Chandramouli)
నటీనటులు: సాయి తేజ కల్వకోట (Sai Teja Kalvakota), పావని కరణం (Pavani Karanam), చిత్రం శీను, మిర్చి కిరణ్ (Mirchi Kiran), డబ్బింగ్ జానకి (Dubbing Janaki), ప్రణవ్ సోను (Pranav Son), ఈ రోజుల్లో సాయి (Ee Rojullo Sai)
దర్శకుడు: ఆనంద్ గుర్రం (Anand Gurram)
నిర్మాతలు: రామ కృష్ణ బొడ్డుల (Rama Krishna Boddula), S.K. శ్రీనివాస్ (S.K. Srinivas)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.