Home » నవ గ్రహ కవచలతో ఉండే వాయు లింగేశుడు – శ్రీకాళహస్తి ఆలయం 

నవ గ్రహ కవచలతో ఉండే వాయు లింగేశుడు – శ్రీకాళహస్తి ఆలయం 

by Lakshmi Guradasi
0 comment

చాల మంది రాహు కేతువుల బారిన పడి చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఆ లయ కారుడు సిద్దపరిచాడు. అది ఎక్కడ అంటే దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖీ నదికి ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. పంచభూత లింగలలో నాలుగోవదైనా వాయు లింగం ఇక్కడే ఉంది. ఇక్కడ అమ్మవారు గ్యన ప్రసూనాంబ తూర్పు దిశగా, స్వామివారు శ్రీ కాళహస్తీశ్వరుడు పశ్చిమ వైపుగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఎటువంటి గ్రహణ సమయంలో నైనా తెరచి ఉండి పూజలు అందుకొనే ఏకైక దేవాలయం శ్రీ కాళహస్తీశ్వరుడి దేవాలయమే. ఇక్కడికి వస్తే ఎలాంటి సమస్యలైనా పోతాయి. 

ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సతో ముక్తి క్షేత్రం, శివ నిందైక నిలయం, సత్య మహా భాస్కర క్షేత్రం అనే మరో పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకుని తరువాత శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకుంటారు. 

Srikalahasti temple

వాయు లింగం:

వాయు లింగం అనే పేరు రావడానికి కారణం వాయు దేవుడు కర్పూర లింగానికి చాల కాలం పూజలు చేసాడు. వాయు దేవుని భక్తికి మెచ్చిన శివుడు మూడు కోరికలు కోరుకోమన్నాడు. అందుకు వాయు దేవుడు నేను ఈ విశ్వమంతా ఉండాలి, ప్రతి జీవిలోను నాకు స్థానం ఉండాలి, నేను పూజించిన ఈ లింగానికి నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని కోరేడు. అందుకే ఆ లింగానికి వాయు లింగం అని పేరు వచ్చిందని ఒక కథ. 

Srikalahasti temple

పురాణం: 

శ్రీ కాళహస్తీశ్వరుడైన మహా శివుడు శ్రీ  కాళహస్తీలో అవతిరించరించడానికి ఒక కారణం ఉంది. పూర్వం మహా శివుడు బ్రహ్మ దేవుడికి కైలాసాన్ని నిర్మించామని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ కైలాసాన్ని నిర్మించేటప్పుడు కంగారు పడి తొందరగా చేస్తూనప్పుడు కైలాసం లోని కొన్ని భాగాలు భూమి పైన పడ్డాయి. అందులో శ్రీ కాళహస్తీలో పడిన భాగము దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది అంటారు. 

సాలీడు, సర్పము, ఏనుగు కథలు:

Srikalahasti temple

సాలీడు, సర్పము, ఏనుగు ఈ మూడు జీవాలు ఒకటికి తెలియకుండా మరొకటి ఒకే లింగానికి పూజలు చేసేవి. కానీ అక్కడ పూజ ద్రవ్యాలు మారడం వలన అన్నిటికి అనుమానం వచ్చింది. ఒకనాడు ఏనుగు నీరు తెచ్చి లింగానికి అభిషేకం చేస్తున్నపుడు సర్పము చూసి ఏనుగు తొండం లో దూరి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ బాధను తట్టుకోలేక ఏనుగు కింద పది మరణించింది. ఆ దాడికి తట్టుకోలేని పాము ఒక బండకు తగిలి చనిపోయింది. అక్కడికి సాలె పురుగు కూడా వచ్చింది. అది మరణించిన ఏనుగు కింద ఉండడం వలన అది కూడా చనిపోయింది. 

ఆ మూడు జీవాల భక్తి కి మెచ్చిన పరమ శివుడు వాటికీ ముక్తి ని ఇచ్చాడు. ఆ జీవులకు వరంగా ఆ పుణ్య స్థలం ఆ జీవుల పేరుతోనే శ్రీ కాళహస్తి అనే పేరు తోనే ప్రసిద్ధి చెందుతుందని వరం ఇచ్చాడు. ఇప్పటికి లింగాన్ని పరిశీలిస్తే కింద ఏనుగు దంతములు, మద్యలో సర్పము, వెనక కింద భాగం లో సాలె గూడు ఉంటుంది. 

శ్రీ కాళహస్తి పరమ భక్తుల కథలు:

పూర్వం పోతపునోడు దెగర ఉడుమూరు అనే గ్రామం ఉండేది. అక్కడ నాగాడు, దత్త అనే బోయ దంపతులకు చాల కాలం వరకు సంతానం కలగక చివరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని ప్రాదించగా తిన్నడు అనే బిడ్డ జన్మిస్తాడు. అతను ఓక బోయవాడు తిన్నడు పెరిగి పెద్దయ్యాక అడవికి వేటకి వెళ్తాడు. అక్కడ ఒక శివ లింగం కనిపిస్తుంది. తిన్నడు తాను వేటాడి తెచ్చిన పంది మాంసాన్ని లింగానికి నైవేద్యం గా అర్పించేవాడు. అప్పట్లో శివ గోచార అనే భ్రహ్మముడు ఉండేవాడు. తిన్నడు శివ లింగానికి చేసి పనులను చూసి చాల బాధ పడ్డాడు. ఆ బాధను తట్టుకోలేక శివ లింగానికి తలను కొట్టుకోవడంతో అగు వెనకకు వెళ్లిదాక్కొని చూడు అనే మాటలు వినిపించాయి. కొద్దీ సేపటికి తిన్నడు తన పూజ కోసం వచ్చాడు. పూలతో అలంకరించి మాంసాన్ని పెట్టాడు. కానీ శివుడు తినలేదు. ఎందుకు తినలేదని తిన్నడు శివలింగం వైపు చూసాడు. ఇంతలో శివలింగానికి ఉన్న కళ్ళలో ఒక కన్నులో నుంచి రక్తం రావడం మొదలైంది. అది గమనించిన తిన్నడు తన కంటిని పీకి రక్తం వస్తున్న కన్నుకి పెట్టాడు. అంతలో రెండొవ కంట్లోచి కూడా రక్తం రావడం మొదలైంది. తన కాలుతో రక్తాన్ని ఆపి రెండొవ కన్నును కూడా పీకడానికి సిద్దమయ్యాడు. అప్పుడు శివుడు ప్రత్యేక్షమై తన కంటిని తిరిగి ప్రసాదించాడు. వెనక నుంచి శివ గోచార తిన్నడు భక్తి ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆలా తిన్నడు కన్నప్ప గా మారేడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్ధం. 

భక్తుడి పాదాల కింద స్వామి ఆలయం: శ్రీ కాళహస్తీశ్వరుడు మహా భక్త ప్రియుడు. ఎక్కడైనా దేవుడు పైన కొండా పైన ఉంటారు, భక్తులు కింద ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప కు కొండపైన దేవాలయం ఉంది, ఈ దేవాలయం కింద శ్రీ  కాళహస్తీశ్వరుడి ఆలయం ఉంటుంది. అందుకే భక్త వల్లభుడు అని పిలుస్తారు. బ్రహ్మోత్సవాల్లో తొలి పూజ కన్నప్పకే చేయడం విశేషం. 

అంతేకాకుండా పరమ భక్తులైన బ్రాహర్ష మహర్షి, ధూర్జటి ల దేహాలను కూడా ఇక్కడే ఆలయంలో సమాధి చేసారు. ఆలయం రాజ ద్వారం దాటే గడప కింద వారి దేహాలను సమాధి చేసినట్టు అని గ్రంధాలు తెలుపుతున్నాయి. 

ఆలయ నిర్మాణం:

ప్రసిద్ధ గోపురం: ఆలయ ప్రధాన గోపురం దక్షిణ భారతదేశ శిల్పకళకి అద్భుతమైన ఉదాహరణ. 120 అడుగుల ఎత్తయిన ఈ గోపురం 11వ శతాబ్దంలో చోళ రాజవంశం కాలంలో నిర్మించబడింది.

రాయల కాలం నిర్మాణాలు: విజయనగర సామ్రాజ్యపు కృష్ణదేవరాయలు శ్రీకాళహస్తి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆలయంలోని శిల్పకళ, ముఖ్యంగా గోపురాలు, రథాలు, శిల్పాలు విజయనగర శిల్పకాలకు మంచి ప్రసిద్ధి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలి గోపురం, వెయ్యి కాళ్ళ మండపాలు ఇంకా అలానే  చెక్కు చెదరకుండా ఉన్నాయి. 

Srikalahasti temple

శ్రీకాళహస్తి ఆలయ రహస్యాలు:

ఇక్కడ కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రాణం ఉన్న శివ లింగం గా భక్తులు నమ్ముతారు. దానికి బలమైన కారణం కూడా ఉంది. గర్భగుడిలో పంచ దీపాలున్నాయి వాటి పేర్లు శి, వా, య, నమః. ఆలయం గర్భగుడిలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న, శివలింగం ముందు ఉన్న దీపం మాత్రం గాలికి రెపరెపలాడుతు ఉంటుంది. ఇది వాయు లింగం గా కొలువై ఉన్న ఆ పరమ శివుడి ఉత్వశ నిత్వశ గాలి కారణంగానే జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. 

ఇక్కడ శివలింగం విషయములో ఇంకో వింత కూడా ఉంది. సాధారణముగా అర్చకులు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఆలయాలలో భక్తులకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆర్చుకులతో సహా ఎవ్వరు ముట్టుకోవడానికి వీలు లేదు. శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగం తెల్లని వర్ణం లో కనిపిస్తుంది. రోజు పచ్చ కర్పూరం తోనే అర్చకులు అభిషేకిస్తారు. అందుచేత ఈ శివలింగానికి కర్పూర లింగం అని మరో పేరు కూడా ఉంది. 

శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగ జీవుల చేత శివుడు పూజలు అందుకున్నందున ఈ ప్రదేశానికి అనే పేరు వచ్చింది. సాలీడు, పాము, ఏనుగు ఆత్మలను ఆ పరమ శివుడు తనలో ఐక్యం చేసుకుని ఇక్కడ స్వయంభు గా నిలిచాడని అంటారు. 

స్వర్ణముఖి నది:

ఇక్కడ స్వర్ణముఖీ నది సాక్షాత్తుగా ఆ గంగాదేవి ప్రతిరూపమని చెప్తారు. శ్రీ కాళహస్తి పక్కన ఏ జీవ నది లేదని అగస్య మహర్షి మహ ముని శివుడ్ని ప్రదించగా అప్పుడు పరమ శివుడు భ్రహ్మ ద్వారా ఆకాశ గంగను బిల్వ వనం దెగర కాళహస్తిలో ప్రవహింపచేసాడు. కాశి లోని గంగ నది వాలే ఇక్కడ కూడా స్నానం చేస్తే తమ పాపాలన్నీ పోతాయని నమ్మకం. 

పురాణాల్లో గౌతమ ముని శాపానికి గురైన ఇంద్రుడు స్వర్ణముఖి నది లో స్నానం చేస్తే శాప విమోచనం జరిగిందని చెప్తారు. 

రాహు కేతు పూజలు:

Srikalahasti temple

రాహు కేతు పూజలు, శ్రీ  కాళహస్తీశ్వరుడు ఉండే నవ గ్రహ కవచం ద్వారా రాహు కేతువుతో పాటు గ్రహాలన్నీ కూడా ఆ శివుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. గ్యాన ప్రసూనాంబ కూడా కేతువు వడ్డనంగా ఉంటాదని ఈ ప్రదేశంలో రాహు కేతు శాంతి పూజలు జరిపిస్తుంటారు. ఈ పూజ రాహు, కేతు గ్రహ దోషాలను నివారించడానికి చేసేది. ఎక్కువుగా వివాహ సంబంధ సమస్యలు, సంతాన బంధం కోసం, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య సమస్యల నివారణకు ఈ పూజలు చేస్తారు. ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల మంది పాల్గుటారు. ఈ పూజ చేయించాలనుకునే వారు ముందుగా ఆలయంలో టికెట్ తీసుకోవాలి. రాహు-కేతు పూజ చేయడానికి ఆలయంలోనే అవసరమైన వస్తువులు ఇస్తారు, భక్తులు ప్రత్యేకంగా ఏవైనా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.ఇక్కడ శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి జరిగే అభిషేకం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. 

చంగల్వరాయణ్ (సుబ్రమణ్య స్వామి) ఆలయం :

ఇక్కడ సుబ్రమణ్య స్వామి ని వల్లి దేవసేన సమేత చంగల్వరాయణ్ గా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ మాత్రమే ఈ పేరు పెట్టి పిలుస్తారు. 

ఇతర దేవాలయాలు: పాతాళ వినాయకుడి ఆలయం, దీని వెనక ఒక కథ ఉంది. పూర్వం దక్షిణ కైలాసానికి వచ్చిన అగస్య మహా ముని వినాయకుని దర్శించకపోవడం వల్ల ఆ నది ఎండిపోతుంది. తన తప్పుని తెలుసుకుని అగస్య ముని వినాయకుడ్ని పూజించినాట్లు స్థల పురాణం చెబుతుంది.

ఇంకా ఇక్కడ వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి సహస్త్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఉన్నాయి. 

సహస్త్ర నమ మండపం:

శ్రీ కాళహస్తీశ్వరుడి ఆలయంలో ఎక్కడ ఆకాశం కనిపించదు. ఈ మండపం వద్ద ప్రత్యకంగా ఉంచిన గుర్తులు దెగర నిలబడి చూస్తే స్వామి వారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయాలు బాగా కనిపిస్తాయి. ఈ మండపం లో ధర్మరాజు, యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు ప్రతిష్టించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. 

తిరుమల నుంచి 40 కిలో మీటర్ల దూరంలోనే  శ్రీ కాళహస్తీ క్షేత్రం ఉంది. కాబ్బటి తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండ శ్రీ  కాళహస్తీ కి వెళ్ళండి. 

శ్రీ కాళహస్తి ఆలయ సమయాలు:

ఉదయం: 6:00 AM నుండి 9:00 PM వరకు
దర్శన సమయాలు:ఉదయం: 6:00 AM నుండి 1:00 PM వరకు
సాయంత్రం: 3:00 PM నుండి 9:00 PM వరకు
రాహు-కేతు పూజా సమయాలు: ప్రతిరోజు ఉదయం 6:30 నుండి రాత్రి 9:00 వరకు ప్రదర్శించబడుతుంది.
ప్రత్యేకించి పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో సమయాలలో ఏవైనా మార్పులు చెందవచ్చు.

శ్రీ కాళహస్తి లొకేషన్ ( Srikalahasti Exact Location):

మరిన్ని ఇటువంటి విహారి యాత్రల కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like

Leave a Comment