ఆమె: టిక్కు టిక్కు మన్నది
టిక్కు టిక్కు మన్నది
సుక్క బొట్టు పెట్టుకుని
పక్క సూపు సూసుకుంటూ
సుట్ఠుకారం తిరుగుతాది
నడకలో ఆహా నడకలో
భలే నడకలో వగలాడి హొయిలున్నవే
నడకలో వగలాడి హోయిలుంటే ల ల న…
అతడు: నాకడ ఓహో నాకడ
భలే నాకడ సరిపోటీ ఆట ఉన్నదే
ఆ…….
ఆమె: అదిరా మానూరి కొండా
అదిరా మానూరి కొండా
అంచున టెంకాయ తోపు
సందె మబ్బు సతీ వాన
సందు కాలే ఏమి సేతు
నీకోసం ఆహా నీకోసం
ఓహో నీకోసం
నిలువలేక నేనొస్తినే
వాకిలి దాటిరార వయ్యారి మామ
వాకిలి అరెరే వాకిలి అల్లే వాకిలి
వాకిలి దాటిరార వయ్యారి మామ
అతడు: నిమ్మపులా చీర నిలుసుంటినే
అరెరే నిమ్మపులా అల్లే నిమ్మపులా చీర నిలుసుంటినే
ఆ…..
సన్ననడుము చిన్నది
సుక్కల్ చీరె గట్టేరా
కాళ్ళ గజ్జల్ కుర్రాది
కుల్కి కుల్కి నడిచేరా
అరెరెరే…
సన్ననడుము చిన్నది
సుక్కల్ చీరె గట్టేరా
కాళ్ళ గజ్జల్ కుర్రాది
కుల్కి కుల్కి నడిచేరా
పిల్లో యనీ వాలు జడ చూడబోతే
వాళ్ళో యనీ వగలమారి పోతది
సరుకు చూపు చిన్నది
సంగటమే అన్నది
సైగ సైగ జేస్తది సైగానే పోతది
ఆమె: పైట జారే పరువాలు
పైన తోలే పైరా గాలి
అందరి కళ్ళు నామింద
నా ఆశ నీమింద
అరెరెరే…
పైట జారే పరువాలు
పైన తోలే పైరా గాలి
అందరి కళ్ళు నామింద
నా ఆశ నీమింద
మావోయ్ యని పైన పైన పడతంటే
వలదో యని పారి పారిపోతావు
అంత నిమ్మ గింత నిమ్మ
నత్త నడుమ నా నగరు
పాలరాతి న సొగసు వలబడిపోతాది
_______________________________________
పాట పేరు : టిక్కు టిక్కు (Tikku Tikku)
సినిమా పేరు: రాచరికం ( Racharikam)
సంగీతం: వెంగి ( Vengi )
గాయకుడు: పెంచల్దాస్ (Penchaldas), మంగ్లీ (Mangli)
సాహిత్యం: పెంచల్దాస్ (Penchaldas )
తారాగణం : విజయ్ శంకర్ (హీరో) (Vijay Shankar), అప్సర రాణి (హీరోయిన్) (Apsara Rani), విజయ్ రామ్ రాజు (Vijay ram Raju), వరుణ్ సందేశ్ (Varun Sandesh)
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ లంకలపల్లి (Suresh Lankalapalli )
నిర్మాత: ఈశ్వర్ (Esshwar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.