మన హిందూ ఆచారాలలో బొట్టు పెట్టుకోవడం అనేది గొప్ప సంప్రదాయంగా మనం భావిస్తాం. బొట్టు ను స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు పెట్టుకుంటారు. మనం బొట్టు పెట్టుకోవడం వళ్ళ చాల ఉపయోగాలు ఉన్నాయి. బొట్టు పెట్టుకుంటే అందంగానే కాదు మనకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
బొట్టును రెండు కనుబొమ్మలు మధ్యలో మనం పెట్టుకుంటాము ఆ ప్రదేశం లో చాల నరాలు ఉంటాయి కొంచెం సేపు ఆ ప్రదేశం మీద ఒత్తి పెట్టి బొట్టు పెట్టుకోవడం వళ్ళ తల నొప్పి తగ్గిపోతుంది.
మన కళ్ళకు సంబంధించిన నరాలు అన్నిటిని కలుపుతూ మన కనుబొమ్మల మధ్య ఒక నరం ఉంటుంది. ఈ నరం మీదనే మనం సాధారణంగా బొట్టు ను పెట్టుకుంటుంటాము. కొంచెం సేపు ఆ ప్రదేశంను ఒత్తి పెట్టడం వలన మన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మనం బొట్టు పెట్టుకున్న తర్వాత మన మొహం చాల కళగా కనిపిస్తుంది. మన ముఖ కండరాలను కలుపుతూ త్రీజీనియాల్ అనే ఒక నాడి ఈ ప్రదేశం లోనే ఉంటుంది. కొంచెం సేపు ఈ ప్రదేశం వత్తడం వలన మన ముఖ కండరాలు అన్ని ఆక్టివేట్ అవుతాయి దాంతో మన మొహం బాగా కళ గా కనిపిస్తుంది.
ఇంకా ఈ నుదిటి ప్రదేశం లోనే ఉండే ఒక నాడి మన చెవికి సంబందించిన కోక్లియార్(cochlear gland) కు కనెక్ట్ అయి ఉంటుంది. దాని ద్వారా మన చెవులు చాల చురుగ్గా పని చేస్తాయి.
ఇంకా మన నుదిటి భాగం లో ఉండే నరాలు మన మెదడులో ఉండే పీనల్ గ్లాండ్ కు కనెక్ట్ అయి ఉంటాయి. బొట్టు పెట్టుకోవడం వలన పీనల్ గ్లాండ్ సెరిటోనిన్ మరియు మెలటోనిన్ అనే హార్టుమోలను వదులుతాయి. ఆ హార్మోన్ లు మనకు బాగా నిద్ర రావడానికి మనం ఆనందంగా ఉండడానికి తోడ్పడతాయి.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.