Home » ఏమైఉండొచ్చో (Yemaiundacho) సాంగ్ లిరిక్స్ | Deepthi Sunaina

ఏమైఉండొచ్చో (Yemaiundacho) సాంగ్ లిరిక్స్ | Deepthi Sunaina

by Manasa Kundurthi
0 comments
Yemaiundacho song lyrics Deepthi Sunaina

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే
ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే

క్షణమైనా కుదురుండలేని
కొత్త దోబూచులాటే ఇది
ఎవరైనా గమనించలేని
మూడు హృదయాల గొడవే ఇది

రెక్కలు ఉండి ఎగిరెళ్లలేని
చిక్కులుపడ్డ ఓ పిట్ట కథ ఇది

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే
ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే

ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో మాయ అనొచ్చో
బాధ అనొచ్చో బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో ఏమైఉండొచ్చో..

నీ చిన్ని గుండెలో ఉన్నదేమిటో
చెప్పనివ్వదే దాచనివ్వదే
నీ చిన్ని ప్రాణమే చిత్రహింసలో
ఊగుతున్నదే ఏ ఏఏ..

నీ చిన్ని ఆశకి తీరమెక్కడో
దారి దోచదే దిక్కు తోచదే
నీ చిన్ని జన్మకి అర్థమేమిటో
అర్దమవ్వదే ఏ ఏ ఏ..

తొంగి చూడ్డాలు పొంగిపోడాలు
ఏమి లేకుండా ఎన్నాళ్ళో
కొంటె భావాలు కూని రాగాలు
బయట పడకుండా ఎన్నేళ్లో

ఈ కలలే ఉప్పొంగే సంద్రాలే
తప్పుకోలేక ఎన్నెన్ని గండాలే
మనసంతా గందరగోళాలే
చెప్పుకోలేని నిప్పుల గుండాలే..

ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో మాయ అనొచ్చో
బాధ అనొచ్చో బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో ఏమైఉండొచ్చో

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే
చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే
ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే

అడుగంత దూరాన ఉన్న
అందుకోలేని తీరేమిటో
ఎంతెంత దగ్గరగా ఉన్నా
దగ్గరవలేని స్థితి ఏమిటో

గుప్పెడు గుండె చప్పుళ్ళ తగువ
తీర్చడమంటే అది అంత సులువా

ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో మాయ అనొచ్చో
బాధ అనొచ్చో బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో ఏమైఉండొచ్చో

________________

Song Credits:

సాంగ్ : ఏమైఉండొచ్చో (Yemaiundacho)
దర్శకత్వం : వినయ్ షణ్ముఖ్ (Vinay Shanmukh)
నటీనటులు: దీప్తి సునైనా (Deepthi Sunaina), సుగి విజయ్ (Sugi Vijay), దివ్య (Divya)
మ్యూజిక్ కంపోజర్: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
గాయకుడు: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
గీత రచయిత: సురేష్ బనిశెట్టి (Suresh banisetti)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.