ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
ఏవో ఏవో కలలు విరిసెనే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా
మనసే ముసుగును తీసే
అడుగులు వేసే బయటకి నీతోనే
కలిసే నిమిషము వణికే పెదవులు పలికే తకధిమి తందానే
ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
నీలో నాలో ఏదో జరిగెనే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా
నింగీ నేలా నీలా నాలా
కలిసాయేమో అన్నట్టు ఉందే
ఆగీ మోగే గుడిలో గంటా
ఎద చప్పుడునే లెక్కిస్తూ ఉందే
మేఘాల పోలికా నా గుండెకంటెనేమో
మరి నిన్ను చూడగా మెరిసే
ఓ చల్లగాలిలా నీ చూపు తాకెనంటే అది వాన చినుకులా కురిసే ..
ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
నీలో నాలో ఏదో జరిగెనే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా
నేనా కాదా నీతో నేనా
ఇది నిజమా నే భ్రమలో ఉన్నానా
సీతాకోకా నేనైపోయా
నీ రంగుల్లో నే పడిపోయాకా
నీ ఊసు దాటని అలవాటు పోదు అసలు
నీ కలను మోయగా కనులూ
నా వేలితో అలా సవరించుకుంటు కురులు
వేవేల నవ్వులే మొదలూ
ఏదో ఏదో ఏదో జరిగెనే ఎద లోపలా
ఏవో ఏవో కలలు విరిసెనే
నిన్నా మొన్నా లేనే లేదిలా అరె ఏంటిలా
ఉన్నట్టుండి ముంచేసావిలా
పాట క్రెడిట్స్:
పాట పేరు: ఏదో ఏదో (Yedo Yedo)
గాయకులు: కార్తీక్ (Karthik), హరిణి ఇవటూరి (Harini Ivaturi)
సాహిత్యం: పూర్ణా చారి (Purna Chary)
సంగీతం: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
నటీనటులు: రాహుల్ విజయ్ (Rahul Vijay), నేహా పాండే (Neha Pandey)
దర్శకుడు: అశోక్ రెడ్డి కడదూరి (Ashok Reddy Kadaduri)
నిర్మాత: అర్జున్ దాస్యన్ (Arjun Dasyan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.