ఏది ఏది కుదురేది ఏది
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక
పెదవే పేరై నీదై ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓ ఓ ఓఓఓ
ఓ ఓ ఓఓఓ
నే ఓడే ఆట నీ వాథం అంట
ఎంతో ఇష్టం గా
నే పాడే పాట నీ పేరేనంట
చాలా కాలం గా
నా కంటూ ఉందా ఓ ఆశ
నీ ఆశే నాకు శ్వాస
ఊహ ఊసు నీతో నేనుంటేస
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కల్లై చుస్తూ ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాల్లవుతున్నా
ఓహో నీ పాఠం నేనే నన్నే చదివేసెయ్ అర్థం కాకుండా
నాలోకం నిండా నీ నవ్వే నాలోను నిండా నువ్వే
తీరం దారి దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే
మనలో నువ్వు నేనూ ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక
పెదవే పేరై నీదై ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
చిత్రం: ఎటో వెళ్ళిపోయింది మనసు
గాయకులూ: షాన్, రమ్య NSK
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
సంగీతం: ఇళయరాజా
దర్శకుడు: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నటులు: నాని, సమంత
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.