కృష్ణుడు అనగానే మనకు గుర్తు వచ్చేది అతని తల పై ఉన్న నెమలి పించం. కృష్ణుడు అలా తల మీద ఎప్పుడు నెమలి పించం ధరించడానికి వెనుకాల ఒక చిన్న కథే ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సంచికను పూర్తిగా చదివేయండి.
త్రేతా యుగం లో విష్ణువు రామావతారం లో ఈ భూమి మీద సంచరించాడని మన అందరికి తెలుసు. అప్పుడు రాముడు సీత 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఒక రోజు సీత దేవికి దాహం వేస్తుంది. దగ్గర్లో ఎక్కడ నీళ్లు ఉండవు.
శ్రీరాముడు లక్ష్మణుడు నీళ్ల కోసం వెతుకుతుండగా వాళ్ళకి అక్కడ ఒక నెమలి కనిపిస్తుంది. నెమలికి దాని చుట్టూ వస్తున్న శబ్దం మరియు వాసనను బట్టి ఎంత దూరం లో నీళ్లు ఉన్నాయో చెప్పగల శక్తీ ఉంది. అల ఆ నెమలి రాముడిని నీళ్లు ఎక్కడ ఉన్నాయో ఆ చోటుకి తీసుకెళ్తుంది. కానీ ఆ చోటు చాల దూరం లో ఉంటుంది ఇంకా రాళ్ళూ ముల్లులు ఇలా నడవడానికి చాల కష్టాంగా ఉంటుంది.
రాముడు మల్లి తిరిగి వెళ్ళడానికి కుదరదు ఏమో అని ఆ దారి మొత్తం ఆ నెమలి తన నెమలి పించాలను వదిలేస్తూ వెళ్తుంది. కానీ రాముడికి నెమలి ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కాదు. అల నెమలి వెనకే చాల సేపు నడిచి వెళ్తాడు. నెమలి పింఛాలు వాటికవే ఊడిపోతే ఏం కాదు కానీ కావాలని తన పించాలను తానే తీసేస్తే రక్తం వస్తుంది ఇక రక్తం పోవడం వళ్ళ చనిపోతుంది.
అల నీళ్ల దగ్గరికి వెళ్ళేలోపు అన్ని పింఛాలు తీసేసి రక్తం పోతు ఉంటుంది. రాముడు అది చూసి ఏంటది ఎందుకలా చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పటికే నీళ్లు కనిపించడం తో రాముడితో ఇలా చెప్తుంది, తన నెమలి పింఛాలు వదిలిన మార్గం లో మీరు వెళ్తే సీత దేవి దగ్గరికి వెళ్లిపోవచ్చు అని చెప్పి చనిపోతుంది.
ఈ విషయం తెలుసుకున్న సీతా దేవి చాల బాధతో రాముడితో తన త్యాగానికి మీరు ఎలా అయినా ఋణం తీర్చుకోవాలి, ఆ నెమలి పించం గురించి అందరు మాట్లాడుకునేలా చేయాలి అని చెప్తుంది. అల సీత దేవి కోరిక వల్ల రాముడు తన తర్వాత అవతారం అయినా కృష్ణుడి అవతారం లో ఆ నెమలి పించం తల పై పెట్టుకుంటాడు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను సందర్శించండి.