Home » విమానం లాంటి సరుకుల రవాణా డ్రోన్

విమానం లాంటి సరుకుల రవాణా డ్రోన్

by Haseena SK
0 comment

చూడటానికి విమానం కనిపించే ఈ వాహనం సరుకుల రవాణా డ్రన్. చైనీస్ కంపెనీ డిజేಐ ఎక్స్ ప్రెస్ కు చెందిన డిజైనింగ్ నిపుణుడు కింగ్ షెంగ్ మింగ్ దీనికి రూపకల్పన చేశారు. వేర్వేరు నగరాల మధ్య వేగంగా సరుకుల రవాణా చేసేందుక వీలుగా దీనిని తీర్చిదిద్దారు. ఈ డ్రోన్ కు ట్రిపుల్ ప్రొపెల్షన్ సిస్టమ్ అమర్చడం వల్ల ఇది శరవేగంగా గమ్యం వైపు దూసుకుపోగలదు. దూరం నుంచి దీనిని నియంత్రించవచ్చు. ఇందులోని సెన్సర్లు అవరోధాలను అధిగమించి ప్రయాణం సాగించడానికి దోహదపడుతాయి. దీనికి అమర్చిన కెమెరా ప్రయాణ మార్గాన్ని ఎప్పుటికప్పుడు రికార్డు చేస్తుంది. దూరంగా ఉండి నిమంత్రించే వారికి ఆ దృశ్యాలను పంపిస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో ఇది పని చేస్తుంది. ప్రయాణానికి అంతరాయం కలగకుండా చార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తేలికగా తీసేసి స్టాండ్ బై బ్యాటరీని సులువుగా అమర్చుకోవచ్చు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ  ను సందర్శించండి.

You may also like

Leave a Comment