Home » వర్షపు వెన్నెల (Varshapu Vennela) సాంగ్ లిరిక్స్ Anil Kumar Kompally

వర్షపు వెన్నెల (Varshapu Vennela) సాంగ్ లిరిక్స్ Anil Kumar Kompally

by Manasa Kundurthi
0 comments
Varshapu Vennela song lyrics Anil Kumar Kompally

ఓ వర్షపు వెన్నెల చలిలో ఎండ గాలులా
ఒకటైతే అలా ఆమె కన్నులా
ఎవరో ఏమిటో తెలియని వింత పరిచయం
తనతో ఈ క్షణం మొదలైందలా..

మళ్ళి మళ్ళి తానే ఎదురైయిందిలే
కొత్త కొత్త ఆశ రేపుతోందిలే
తెలుసుకున్నా కొద్దీ మంచిగుండదిలే
కలిసే రుచులు మనని కలుపుతోందిలే…

ఇంకా ఇంకా ఎదో ఎదో కావాలంది నా మనసే
చూపుల్తోనే చెబుతూ ఉంటె ఓ సారైనా చదివేసెయ్
నీతో ఉంటే నన్నే నేనే మరిచే మాయే చేసావే
చూసే కొద్దీ చూడాలన్న చిత్రం నీ చిరు నవ్వే

నా మనసే… నా మనసే…. నా మనసే

అడుగులే జతపడే పయనం సాగే దారిలో
కబురులే తరగని సమయం ఆగే వేళలో
దూరమింక దూరమైయ్యే స్నేహం నిండే చోటులో
చిరు చిరు చోరవాలే పెదవులు కోరే హాయిలో

కలో ఇలో తేలీని మైకంలోనే తూలానా
ఇలా అలా ఎలాగోలా నీ లోలో వాలనా
నరం నరం తరించిపోయే అందం చూడనా
మరి మరి మరింతలైనా జరిగేదాగునా

కలలే కూలి పడిపోయే
ఊహలు చెదిరి విడిపోయే
నాదనుకున్న నీ నవ్వే
వదిలి వెలిపోయే…

గతమైపోయే నీ ప్రేమ
తీరిగోస్తుంద ఆ జన్మ
ప్రాణంలోన సగ భాగం
ఎపుడు నీదమ్మా..

నువ్వులేక నేను లేననే నిజం
రోజు నన్ను కాల్చుతున్న జ్ఞాపకం
మాటలన్నీ మౌనమైన జీవితం
మారుతుందో లేదో నా ప్రస్తుతం..

ఇంకా ఇంకా నీతోనే నా జీవితం అన్నాది నా మనసే
చూపుల్తోనే చెబుతూ ఉంటె ఓ సారైనా చదివేసెయ్
నీతో ఉన్న నిమిషం లోనే మళ్ళి కొత్తగా పుట్టలే
చూసే కొద్దీ చూడాలన్న చక్కని నవ్వు నీదెలే

____________________

సంగీత దర్శకుడు: అలన్ ప్రీతమ్ (Allan Preetham)
గాయకులు: PVNS రోహిత్ (PVNS Rohit) & పల్లవి అన్నవజ్జల (Pallavi Annavajjala) (Telugu),
లిరిసిస్ట్: రాకేండు మౌళి వెన్నెలకంటి (Rakendu Mouli Vennelakanti)
నటీనటులు: అనిల్ కుమార్ కొంపల్లి (Anil Kumar Kompally), యష్నా ముత్తులూరి (Yashna Muthuluri)
నిర్మాత: సాయి అరవింద్ సమ్మెట (Sai Aravind Sammeta)
దర్శకుడు: చంద్రకాంత్ దత్తా (Chandrakanth Dutta)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.