మీర్జాపూర్ సింహాసనం కోసం కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, ఎత్తులకు పైఎత్తులతో ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మీర్జాపూర్ మూడో సీజన్ వస్తోంది. ఈ సీజన్‍కు సంబంధించిన స్టోరీలైన్, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్-3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్లను ఒకేసారి రిలీజ్ చేశారు. తెలుగు సహా అన్ని భాషల్లో సిరీస్ అందుబాటులో ఉంది. రెండో సీజన్‌లో మున్నా(దివ్యేందు శర్మ)ను అంతం చేసి మీర్జాపూర్‌ను గుడ్డు(అలీ ఫజల్) సొంతం చేసుకుంటారు. దాన్ని గుడ్డు ఎలా పాలిస్తారు? అతడిని చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవడానికి లోకల్ గ్యాంగ్స్ చేసే ప్రయత్నాలను పార్ట్-3లో చూపించారు.
జూలై 5న మరికొన్నిగంటల్లోనే ఈ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ 3వ సీజన్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. మీర్జాపూర్ తొలి రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. మున్నా త్రిపాఠి చనిపోవడం, కాలీన్ భయ్యా పారిపోవటంతో పూర్వాంచల్‍పై గుడ్డు ఆధిపత్యాన్ని దక్కించుకుంటాడు. కాలీన్ భయ్యా గుర్తులను సమూలంగా చెరిపివేయాలని అనుకుంటాడు.
బీనా త్రిపాఠి (రసిక దుగల్) కూడా అతడికి మద్దతుగా నిలబడుతుంది. అయితే, అధికారంతో కళ్లు మూసుకుపోయి చేసే కొన్ని పనులతో గుడ్డు పతనం మొదలవుతుందనేలా ట్రైలర్లో మేకర్స్ చూపించారు. కాలీన్ భయ్యా కూడా మళ్లీ సింహాసనం కోసం తిరిగిరానున్నాడు. మున్నాభాయ్ మరణం వల్ల సానుభూతి ఏర్పడటంతో మాధురీ యాదవ్ రాజకీయాల్లోకి వస్తుంది.
దీంతో ఈ మూడో సీజన్‍లో రివేంజ్ డ్రామా ఎత్తులకు పైఎత్తులతో మరింత రసవత్తరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మీర్జాపూర్ మూడో సీజన్‍కు గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. రెండో సీజన్ వచ్చిన నాలుగేళ్లకు ఈ మూడో సీజన్ వస్తోంది.
ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉండటంతో ఈ మూడో సీజన్ ఓటీటీ రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు ఉన్నాయి. మీర్జాపూర్ సిరీస్‍కు కరణ్ ఆయుష్మాన్, పునీక్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నారు. ఆనంద్ భాస్కర్ ఈ సిరీస్‍కు సంగీతం అందించారు. జూలై 5 నుంచి ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ మూడో సీజన్‍ను చూసేయవచ్చు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ OTT ను సందర్శించండి.