Home » తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ (Thangedu Puvvullo Theliyadhe Janu) – జానపద పాట

తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ (Thangedu Puvvullo Theliyadhe Janu) – జానపద పాట

by Vishnu Veera
0 comment
729

తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ
తొలి చూపుల్లో నీకు నేనేమైతాను
తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ
తొలి చూపుల్లో నీకు నేనేమైతాను

నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయే
పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే

తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ
తొలి చూపుల్లో నాకు బావవైతావు
తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ
తొలి చూపుల్లో నాకు బావవైతావు

గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను
గురుతోచ్చే పనులకు నేనేమైతాను
గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను
గురుతోచ్చే పనులకు నేనేమైతాను

మురిపాలు పంచంగా సగభాగం నేనుకంగా
నూరేళ్ళ బంధానికి మనసే ఒక్కటీ కంగా

గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ
గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు
గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ
గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు

మందార పువ్వుల్లో తెలియదే జాను
మారము ముద్దకు నేనేమైతాను
మందార పువ్వుల్లో తెలియదే జాను
మారము ముద్దకు నేనేమైతాను

ధైర్యన్ని పెంచంగా మనసే వెన్నకంగా
బాధలు ఎంనున్న చిరునవ్వు నవ్వంగా

మందార పువ్వుల్లో తెలియదా బావ
మారము ముద్దకు నాన్నవైతావు
మందార పువ్వుల్లో తెలియదా బావ
మారము ముద్దకు నాన్నవైతావు

కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను
కంటకాన్నీరొస్తే నేనేమైతాను
కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను
కంటకాన్నీరొస్తే నేనేమైతాను

ఏడిపిస్తే ఏకంగా మడతేసి కొట్టాంగ
కష్టపు సమయాన తోడు నీడైరంగ

కుంకుమ పువ్వుల్లో తెలియద బావ
కంటకాన్నీరస్తే అన్నవాయితావు
కుంకుమ పువ్వుల్లో తెలియద బావ
కంటకాన్నీరస్తే అన్నవాయితావు

అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను
అల్లరి పనులకు నేనేమైతాను
అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను
అల్లరి పనులకు నేనేమైతాను

వాకిళ్ళు అలుకంగా ముగ్గులే వేయంగా
చిలిపి చేష్టలతో ఆటలే అడంగ

అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
అల్లరి పనులకు తమ్ముడైతావు
అరిటాకు పువ్వుల్లో తెలియద బావ

అల్లరి పనులకు తమ్ముడైతావు
అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
అల్లరి పనులకు తమ్ముడైతావు

గాయకులు : బొడ్డు దిలీప్, లావణ్య
దర్శకత్వం, నిర్మాత: సురేందర్ మను
సాహిత్యం: సురేందర్ మను
సంగీతం: ప్రవీణ్ కైతోజు
తారాగణం: శ్రేయ దీప్, సురేందర్ మను

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version