సుక్క నీరే సుక్క నీరే
ఒక్క పూట సిక్కదాయే
వచ్చి దాహం తీర్చవయ్యా ఊరికి
పచ్చి గంగని పంపవయ్యా పైరుకి
రెక్కలేమో ముక్కలాయే
డొక్కలన్ని చిక్కిపాయే
వచ్చి కట్టం తీర్చవయ్యా సీమకి
సచ్చి నీకే పుడతా మళ్ళి జన్మకి
మొక్కలన్నీ మొక్కుతావున్నాయ్
దిక్కులన్నీ తొక్కుతావున్నాయ్
గుక్కలోకి గుండెలో సేరి
వెక్కి వెక్కి నిక్కుతావున్నాయ్
నల్ల మబ్బు నల్ల హంసాయే..
జల్లు మాకు నల్లపుసాయే
సెమ్మ కన్ను సెల్లనికాసాయే
ఓ దొర మా దొర ఊతమియ్యరా
రా దొర రా దొర నువ్వే ఆసరా
ఓ దొర మా దొర ఊతమియ్యరా
రా దొర రా దొర నువ్వే ఆసరా
ఏ బావి సూసినా ఎండమావి రో
ఏ బతుకు సూసినా ఎండినాది రో
ఏ బావి సూసినా ఎండమావి రో
ఏ బతుకు సూసినా ఎండినాది రో
ఓ దొర మా దొర ఊతమియ్యరా
రా దొర రా దొర నువ్వే ఆసరా
ఓ దొర మా దొర ఊతమియ్యరా
రా దొర రా దొర నువ్వే ఆసరా
____________________
సాంగ్ : సుక్క నీరే (Sukka Neere)
సినిమా: డాకు మహారాజ్ (Daaku Maharaaj)
గాయకులు: థమన్ S (Thaman S), రియా సీపాన (Riya Seepana)
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్ (Ananth sriram)
సంగీతం – థమన్ ఎస్ (Thaman S)
రచన మరియు దర్శకత్వం: బాబీ కొల్లి (Bobby Kolli)
నటీనటులు: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.