వదువేమో అలమేలు వరుడట శ్రీవారు
మనువాడి కలిశారు
చెలిమి కలిమి ఒకరి కొకరు
ఈ జంటను దీవించగా
దేవతలందరి నోటా
పలికెను చల్లని మాట
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
మీసకట్టు కుంకుమ బొట్టు
కంచి పట్టు పంచె కట్టు
అల్లుకుంది అనుబంధము
మమతలు ముడివేస్తూ
తాను తన తాళి బొట్టు
ఆమె తన ఆయువు పట్టు
ఏకమైంది దాంపత్యం
ఏడడుగులు వేస్తూ
నాలో సగం నీవంటూ
నీలో సగం నేనంటూ
జనుమలు జతపడు వలపుగా
ఇరుమనసులకొక తలపుగా
కలగలిసిన ఒక్క తనువుకు
శతమానం భవతి
శతమానం భవతి
అందగాడు అందరివాడు
అందుబాటు బంధువు వీడు
రేవు పక్క రేపల్లెకు
నచ్చిన చెలికాడు
పంచదార నవ్వుల వాడు
పాతికేళ్ల పండుగ వీడు
తాతయ్యకు నానమ్మకు
నమ్మిన చేదోడు
ఉగ్గుపాలే గోధారై
ఊపిరి గాలెయ్ గోధారై
గల గల పరుగులు కలలుగా
అలలెగసిన తలువయసుకు
నలుపెరగని పసి మనసుకు
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
చిత్రం: శతమానం భవతి
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గాయకులూ: చిత్ర, విజయ్ యేసుదాస్
దర్శకుడు: వేగేశ్న సతీష్
నటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయ సుధా, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.