సన్నగ వీచే చల్లగాలికీ
కనులుమూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై
ఆ… కలలో వింతలు కననాయే
సన్నగ వీచే చల్లగాలికీ…
కనులుమూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై
ఆ కలలో వింతలు కననాయే
అవి తలచిన ఏమో సిగ్గాయే
కనులు తెరిచినా నీవాయే…
నే కనులుమూసినా నీవాయే
కనులు తెరిచినా నీవాయే…
నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే
నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే
కలవరపడినే కనులు తెరువ
నా కంటిపాపలో నీవాయే
ఎచట చూచినా… నీవాయే
కనులు తెరిచినా నీవాయే…
నే కనులుమూసినా నీవాయే
కనులు తెరిచినా నీవాయే…
మేలుకొనిన నా మదిలో ఏవో
మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో ఏవో
మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలయ వెదక
నా హృదయ ఫలకమున నీవాయే
కునులు తెరిచినా నీవాయే…
కనులుమూసినా నీవేనాయే
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.