Home » రోబో ప్లోర్ క్లీనర్

రోబో ప్లోర్ క్లీనర్

by Rahila SK
0 comment

ఇప్పటికే రోబో వాక్యూమ్ క్లీనర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని మించిన రోబో ప్లోర్ క్లీనర్ ఇది. అమెరికన్ కంపెనీ ‘ యూఫీ’ ఈ రోబో ప్లోర్ క్లీనర్ ను రూపొందించింది. ఇది సెల్ఫ్ క్లీనింగ్ ఫ్లోర్ వాషంగ్ రోబో నేల మీద దుమ్ము దూశి వంటి చెత్తనంతటినీ ఇందులోని వాక్యూమ్ క్లీనర్ నిమిషాల్లో తొలగిస్తుంది. అంతేకాకుండా, నేలను శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచేస్తుంది. మూఫీ కంపెనీ’ ఎస్1 ప్రో’ పేరుతో తయారు చేసిన ఈ ఫ్లోర్ వాషింగ్ రోబో ‘త్రీడీ మ్యాట్రిక్స్ ఐ డెప్త్ పెర్సెప్షన్ సిస్టమ్’ ద్వారా పని చేస్తుంది. దారిలో అడ్డుగా ఉన్నవస్తువులను తనంతట తానే తప్పుకుంటా గది నలుమూలలా కలియతిరుగుతూ మారుమూలల్లోని చెత్తను సైతం తొలగిస్తుంది. ఇందులోని ‘లిడార్’ యూనిట్ వల్ల ఈ రోబో గదిలో కలియదిరుగుతూ శభ్రం చేసేటప్పుడు భారీ ఫర్నిచరర్ ను ఢీకొనకుండా మారుమూలలకు సైతం చేరుకోగలుగుతుంది. నేలను శుభ్రం చేయడంలో ఇది నివుణుడైన మనిషి కంటి సమర్థంగా పనిచేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర1499 డాలర్లు (సుమారు రూ1.25 లక్షలు).

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ  ను సందర్శించండి.

You may also like

Leave a Comment