కనులు నిన్ను చూసినప్పుడే
కల గన్ననే కలిసున్న రోజులే
మదిలో నిన్ను దాచినప్పుడే
మొదలాయనే ఆ క్రిష్ణ బాధలే
బృందావనమంటి బ్రతుకు బీడు ఆయనే
మధుర లాంటి మనసులోన ముళ్ళు మొలిసినే
గోవర్ధనగిరి కన్న గుండె బరువుగా ఆయెనే
నువ్వు నా పిల్లని అనుకుంటు ఉన్ననే
రాతలో లేని రాధని నను ఏడిపించకే
నువ్వు నా పిల్లని కలగంటు ఉన్ననే
రాతలో లేని రాధని నను బాధవెట్టకే
కృష్ణ మనసు పడకురా రాతలో లేని రాధపై
కృష్ణ దిగులు పడకురా దొరకని దేవి ప్రేమకై
కృష్ణ మనసు పడకురా రాతలో లేని రాధపై
కృష్ణ దిగులు పడకురా దొరకని దేవి ప్రేమకై
నోచుకోల రాణిల నిను చూసేటందుకు
రాజు గాధ యుద్దమైన చేసేటందుకు
నోచుకోలె నాలో ప్రేమ చూపేటందుకు
ఓడుతున్న తిరిగి ప్రేమ పొందేటందుకు
ఎంత పిలిచినా నిన్ను ఎంత తలిచినా
నిన్ను ఎంత కొలిచినా నిన్ను ఆ దరికి నువ్వు రావు
నువ్వు నా పిల్లని అనుకుంటు ఉన్ననే
రాతలో లేని రాధని నను ఏడిపించకే
నువ్వు నా పిల్లని కలగంటు ఉన్ననే
రాతలో లేని రాధని నను బాధవెట్టకే
కృష్ణ మనసు పడకురా రాతలో లేని రాధపై
కృష్ణ దిగులు పడకురా దొరకని దేవి ప్రేమకై
రాసిలేదే ఏడడుగులు యేసేటందుకు
ఓయ్ పెళ్లామా అని ముద్దుగా నిను పిలిచేటందుకు
రాసిలేదే జన్మలో ఒకటయ్యేటందుకు
ఒక గూటిలోన హాయిగా ముసలయ్యేటందుకు
ఎంత గింజుకున్న నేను ఎంత మొత్తుకున్న నేను
ఎంత భాద పడ్డ నేను నీ వాడి నవ్వ లేను
నువ్వు నా పిల్లని అనుకుంటు ఉన్ననే
రాతలో లేని రాధని నను ఏడిపించకే
నువ్వు నా పిల్లని కలగంటు ఉన్ననే
రాతలో లేని రాధని నను బాధవెట్టకే
రాధే శ్యామ్ అది అద్భుత కావ్యం ప్రేమమ్
రాధే శ్యామ్ ప్రకృతి ఇత కార్యం ప్రేమమ్
రాధే శ్యామ్ ఇరుమనసుల స్తోత్రం ప్రేమమ్
రాధే శ్యామ్ అది మురిపించే చైత్రం ప్రేమమ్
మరిన్ని ఇటువంటి పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి