రమణి ముద్దుల గుమ్మ రంగు రంగుల బొమ్మ అందాల చెలికత్తెవే
నెమలి కన్నులదాన నమిలే చూపులతోటి నన్నింకా కవ్వించకే
వగల వన్నెగాడ సిలిపి పనులతోడ సిత్రాలెన్నో జేస్తవు
వద్దు వలదు అన్న హద్దులన్నీ దాటి సరసమాడవస్తవు
పట్టుచీరలు దెచ్చి పదిలంగా జుట్టి పెళ్లికూతురు తీరు నిను జేస్తనే
వాయనాలు అందుకున్నాక ఓరయ్యో నిన్ను నేను వదలను
క క క కౌగిలింతల్లోన అపురూపంగా నిన్ను బందిస్తాను
గు గు గు గుండెల్లోని ప్రేమ మొత్తంగా నీకిస్తాను
జ జ జ జతగూడి నీతో జామురాతిరి గడిపేస్తాను
ప ప ప పరువాల వయనాలు అన్నీ నీకిస్తాను
సిత్తరాల సినుకు కురిసిన యేళ ఒళ్ళంతా ఒక్కింత పులకించనే
వెచ్చ వెచ్చని నీ కౌగిలింతల్లోన చలిగాచుకుంటానే
జొన్నగట్ల గాడ జోరుమాటలు పలికి మనసుదోసుకున్న మాయగాడ
వన్నెసిన్నులతోడ నిన్నింక మెప్పించి నన్నిచ్చుకుంటా సందెకాడ
పూలపరుపుల పైన పరువాలన్నీ పరిచి నన్నే ఏంచేస్తావో
పూలపరుపుల పైన పరువాలన్నీ పరిచి నన్నే ఏంచేస్తావో
ముద్దుమురిపాలంటూ నిలువెల్లా నిను దోచి కాజేసిపోతాను
క క క కౌగిలింతల్లోన అపురూపంగా నిన్ను బందిస్తాను
గు గు గు గుండెల్లోని ప్రేమ మొత్తంగా నీకిస్తాను
జ జ జ జతగూడి నీతో జామురాతిరి గడిపేస్తాను
ప ప ప పరువాల వయనాలు అన్నీ నీకిస్తాను
మాటగలిపిన చోట సూపులసయ్యాట ఏకమయ్యే సమయం మొదలాయనే
కలిసి బతికే జంట సంతోషాల పంటై బతుకంతా సాగాలి
కళ్ళముందు నిలిచి కదలకుండా ఉండి గడిచేటికాలన్నీ ఆపెయ్యాలి
ఈ పొద్దు మా పొద్దు జ్ఞాపకంగానే మిగులుండి పోవాలి
చిమ్మచీకటిలోన నవ్వూ పంచంగ కాంతులు వెలగాలే
చిమ్మచీకటిలోన నవ్వూ పంచంగ కాంతులు వెలగాలే
రెండుగుండెల నిండా ప్రమే పొంగి సెలయేర్లు పారాలే
క క క కౌగిలింతల్లోన అపురూపంగా నిన్ను బందిస్తాను
గు గు గు గుండెల్లోని ప్రేమ మొత్తంగా నీకిస్తాను
జ జ జ జతగూడి నీతో జామురాతిరి గడిపేస్తాను
ప ప ప పరువాల వయనాలు అన్నీ నీకిస్తాను
రమణి ముద్దుల గుమ్మ రంగు రంగుల బొమ్మ అందాల చెలికత్తెవే
నెమలి కన్నులదాన నమిలే చూపులతోటి నన్నింకా కవ్వించకే
వగల వన్నెగాడ సిలిపి పనులతోడ సిత్రాలెన్నో జేస్తవు
వద్దు వలదు అన్న హద్దులన్నీ దాటి సరసమాడవస్తవు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!