Home » రాతిరి సీకటిలో (Raathiri Chikatilo) సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk Song)

రాతిరి సీకటిలో (Raathiri Chikatilo) సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk Song)

by Vinod G
0 comments
raathiri chikatilo e nagarame nidarothundi folk song lyrics

నీ కలువానీ కన్నుల్లోన వెలుగే ఎవరమ్మా
నీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మా
నీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే సెప్పమ్మా
నడి రాతిరి చంద్రుడు ఎవడయ్యడోయెమ్మా

రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది
తన నిదురను దోచేసే రూపం నీదయింది

రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది
నా నిదురను దోచేసే రూపం నీదయ్యింది
నేనెందరిలో ఉన్నా నా సుందరి కనపడుతుంది
ఎద హత్తుకునే సమయం రానే వచ్చేసింది
ఎడడుగుల జీవితమో ఎద పలికే సంగతమో
ఏ జన్మలో పుణ్యమో ఏ నాటిదో ఈ బంధమో
నీతోడే కావాలి గడిసేటి గడియైన
నీ చెయ్యే వదలనులే చావైనా బతుకైనా
రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది
నా నిదురను దోచేసే రూపం తనదయ్యింది

నా అడుగులో అడుగేసే అలకైనా అందంగుంది
అరచేతిని పట్టుకునే అదృష్టం అయ్యింది

నీ మాటలు వినకుండా కునుకైనా రానంటుంది
నువ్వు ఎదురుగా నిలబడితే ఏదేదో అవుతుంది

ఓ పలుకుల చిలకమ్మా నిను కోరిన ఈ జన్మ
మాట్లాడే సిరి బొమ్మ నా బతుకంతా నీకమ్మా

కుదురుగ నేనుండనులే నిను కలిసే వరకూ
కాలాన్నే ముందుకు తోయన నా చెలి నీ కొరకు

రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది
తన నిదురను దోచేసే రూపం నీదయింది

నీ కలువానీ కన్నుల్లోన వెలుగే ఎవరమ్మా
నీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మా
నీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే సెప్పమ్మా
నడి రాతిరి చంద్రుడు ఎవడయ్యడోయెమ్మా

ఆ నింగిలో వెన్నెల నా గుండెకు దిగివచ్చింది
వందేళ్లు నీతోనే అని వరమే ఇచ్చేసింది

నా చేతిలో నీ పేరే గోరింటాకైరాసింది
నీ వేలిని పట్టుకునే క్షణమే వచ్చేసింది

ఆ దేవుడి సాక్షిగా పూజిస్తా దేవత గా
నా మనసే మేడగా వెంటుంటానే నీడగా

మనపెళ్ళి సందడిలో నే చిందులు వేస్తున్నా
నీ జతనే కావాలే ఇంకో వెయ్యేళ్ళయినా

రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది
నా నిదురను దోచేసే రూపం తనదయ్యింది

నువ్వు పక్కన లేకుంటే క్షణమే ఒక యుగమవుతుంది
ప్రతి నిమిషం నీతోనే ఉండాలనిపిస్తుంది
నువ్వు దూరంగెలుతుంటే ఎద బారంగుంటుంది
నీ నవ్వుకు కారణమే నేనవ్వాలని ఉంది

నీతోనే హయిగా ప్రతిరోజూ పండగా
ప్రేమిస్తా ప్రాణంగా నా ప్రపంచం నువ్వుగా

మరు జన్మే నాకుంటే నీకోసం పుడతానే
కాటిలో నీతోడైన సంతోషంగొస్తానే


మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.