Home » ప్రేమ యాత్రలకు బృందావనము లిరికల్ సాంగ్ – గుండమ్మ కథ

ప్రేమ యాత్రలకు బృందావనము లిరికల్ సాంగ్ – గుండమ్మ కథ

by Nikitha Kavali
0 comments
prema yatralaku song lyrics telugu

ప్రేమ యాత్రలకు బృందావనము
నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము యేలనో … అహ హ అహ హ హ
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము యేలనో
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనము యేలనో

తీర్థయాత్రలకు రామేశ్వరము
కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా
వేరే దైవము యేలనో … అహ హ అహ హ హ
ప్రేమించిన పతి ఎదుటనుండగా
వేరే దైవము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము
కాశీప్రయాగలేలనో

చెలి నగుమోమె చంద్రబింబమై
పగలే వెన్నెల కాయగా
చెలి నగుమోమె చంద్రబింబమై
పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో
జగమునె ఊటీ శాయగా … అహ హ అహ హ హ
సఖి నెరిచూపుల చల్లదనంతో
జగమునె ఊటీ శాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు
కాశ్మీరాలూ యేలనో

కన్నవారినే మరువజేయుచూ
అన్ని ముచ్చటలు తీర్చగా
అహ హ అహ హ హ … అహ హ అహ హ హ
కన్నవారినే మరువజేయుచూ
అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని
సర్వశాస్త్రములు చాటగా … అహ హ అహ హ హ
పతి ఆదరణే సతికి మోక్షమని
సర్వశాస్త్రములు చాటగా

తీర్థయాత్రలకు కైలాసాలు
వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే
భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనము యేలనో


పాట పేరు : ప్రేమ యాత్రలకు (Prema Yatralaku)
సినిమా పేరు : గుండమ్మ కథ (Gundamma Katha)
గానం : ఘంటసాల (Ghantasala), సుశీల (Suseela)
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు (Pingali Nagendrarao)
సంగీతం : ఘంటసాల (Ghantasala)
దర్శకుడు : కమలాకర కామేశ్వరరావు (Kamalakara Kameswara Rao)
తారాగణం : ఎన్.టి. రామారావు (N. T. Rama Rao), అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), సావిత్రి (Savitri), జమున (Jamuna) తదితరులు

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.