ప్రపంచమే కాదన్నా (Prapanchame Kadanna) సాంగ్ లిరిక్స్ – భగీరథ

by Manasa Kundurthi

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తంరా
అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా
నీలొ ఉండే ప్రాణం నేస్తంరా..

పాపలా నువున్నచో తను కన్నురా..
పాదమై నువున్నచొ తను మన్నురా..
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా..
ఈ చోటనే కాదు స్వర్గాన నీ తొడురా…

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తంరా

త్యాగాలే చేసేది త్యాగాలే అడిగేది త్యాగంలో బ్రతికేది స్నేహమే
లోపాలే చూసేది అపై సరిచేసేది లాభలే చూడనిది స్నేహమే
పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది..
పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది..
ఇద్దరికిద్దరు రాజులు ఏలే రాజ్యం స్నేహనిదీ
యుద్దాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహనిదీ….

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తంరా

విశ్వాసం తొలిమేట్టు విశ్వాసం మలిమేట్టు విశ్వాసమే చివరంటూ ఉన్నదీ
ఆకాశం హద్దయిన వినువీధె తనదైన ఈ భూమే నెలవంటూ అన్నదీ
కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ..
కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ..
మనసున దాగిన మనసుని చూపే ఆక్రుతీ స్నేహనిదీ
మనిషిని పూర్తిగా మనిషినిగా మార్చే సంస్కృతి స్నేహనిదీ…
ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

లాలించగా ఆమ్మల్లే పాలించగా నాన్నాల్లే లభించిన వరమే నేస్తంరా
ఆడించగా అన్నల్లే భొదించగా గురువల్లే చెల్లించనీ రుణమే నేస్తంరా..
పాపలా నువున్నచో తను కన్నురా..
పాదమై నువున్నచొ తను మన్నురా..
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా..
ఈ చోటనే కాదు స్వర్గాన నీ తొడురా…

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

______________________

సాంగ్ : ప్రపంచమే కాదన్నా (Prapanchame Kadanna)
చిత్రం: భగీరథ (Bhageeratha)
లిరిక్స్ : చంద్రబోస్ (Chandrabose)
సంగీతం: చక్రి (Chakri)
గాయకుడు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
నటీనటులు : రవితేజ (Ravi Teja), శ్రేయ (Shreya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like