ఓ చెలి తారా (O Cheli Thaara) సాంగ్ లిరిక్స్ సమ్మోహనం (Sammohanam) | TeluguReaders

by Manasa Kundurthi

ఓ… చెలి తారా
నా మనసారా…
మరలా… మరలా ..
మరలా నిను రమ్మని వెలుగే తెమ్మని
మరోసారి నీతో అంటున్నా

ఓ… అనగా అనగా
కలలాగా నిన్ను అనుకోలేను
జతగా కదిలే కథలాగా
నీతో కలిసుంటాను
నీతో కలిసుంటాను

నచ్చి చేరువైనదేదో
ఇట్టే దూరమైనదే
నాతో ఉండి లేనిదేదో
నేడే అర్థమైనదే
ఏదో వెలితి ఏదో శూన్యం
నలిగినది హృదయం
కదలదిక సమయం
ఓ… చెలితారా

నువ్వే పక్కనున్న పూటా
పాటే పండు వెన్నెలా
తోడై నువ్వు లేని చోటా
నేనో మూగ కోయిలా
నువ్వే నాలో చలనం
ఎదనూయలలూపే పవనం
నువ్వే లేని విరహం
ప్రతిక్షణమూ నాకో మరణం
రావె చెలియా నీ రాకే కిరణం
ఓ… చెలితారా
నా… చెలితారా… హే….

______________________

సాంగ్: ఓ చెలి తారా (O Cheli Thaara)
చిత్రం: సమ్మోహనం (Sammohanam)
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad)
దర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి (MohanaKrishna Indraganti)
నటీనటులు : సుధీర్ బాబు (Sudheer Babu), అదితి రావు హైదరి (Aditi Rao Hydari)
సంగీతం: వివేక్ సాగర్ (Vivek Sagar)
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకుడు: హరిచరణ్ (Haricharan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like