Home » నిన్ను తలచి (Ninnu Talachi) సాంగ్ లిరిక్స్ – విచిత్ర సోదరులు (Vichitra Sodarulu)

నిన్ను తలచి (Ninnu Talachi) సాంగ్ లిరిక్స్ – విచిత్ర సోదరులు (Vichitra Sodarulu)

by Vinod G
0 comments
ninnu talachi song lyrics vichitra sodarulu

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే
ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయే జీవితం
జోరువానలోనా ఉప్పునైతి నేనే
హొరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలి మేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా
అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా
అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే
ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే


చిత్రం:  విచిత్ర సోదరులు (Vichitra Sodarulu)
పాట పేరు: నిన్ను తలచి (Ninnu Talachi)
తారాగణం: కమల్ హాసన్ (Kamal Haasan), గౌతమి (Gautami) తదితరులు
గాయకులు: S. P. బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam)
సాహిత్యం: రాజశ్రీ (Rajasri)
సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraaja)
చిత్ర దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao)

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.