Home » నీ ఎన్నెల ఈడు జూసి జాను సాంగ్ లిరిక్స్ – జానపద పాట

నీ ఎన్నెల ఈడు జూసి జాను సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comments

మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు
కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైన రాదు
నా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోను
నా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోను

నీ ఎన్నెల ఈడును జూసి మందిలో సైగాలు జేస్తే
సందుల సాటుకు వచ్చి సీకటి సోకులుజేసే
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనూరుకోను
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనూరుకోను

కన్నఒళ్ళే కాదనన్న కులపోళ్లే కావలన్న
తొడగొట్టి సెప్పుతున్న నీ నుదుట బొట్టు నైత
ఇగ అద్దంటే ఆగేదె లేదు అల్లుఅర్జునులా తగ్గేదె లేదు
అద్దంటే ఆగేదె లేదు అల్లుఅర్జునులా తగ్గేదె లేదు

మూడుపూట ముచ్చట్లు ఎన్నిజూస్త నేనేడు
వాడుకోని వదిలేసె నీలాంటి మగవాళ్లు
దమ్ముంటే మావోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడిజూడు
దమ్ముంటే మావోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడిజూడు

నువ్ లేని నా గుండె ఆగిపోతా అంటుందే
నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే
చల్ ఎట్లయితే అట్లాయే జాను మీవోళ్లతోనే మాట్లాడుతాను
ఎట్లయితే అట్లాయే జాను మీవోళ్లతోనే మాట్లాడుతాను

పిల్లగా సిగ్గులేక రమ్మంటే ఇంటికొస్తవా ఇంటి
ఎవలైనాజూసినంటే నెత్తినిండానువ్వంటే
రామ దండాలు నీకు సామి రాసి పెట్టుంటే అయితదిలే పెళ్లి
రామ దండాలు నీకు సామి రాసి పెట్టుంటే అయితదిలే పెళ్లి

ఒక్కసారి సోపతైతే సచ్చెదాక ఇడిసిపోను
నమ్మబుద్ది కాకపోతే గుండె కోసి ప్రేమజూడు
అబ్బా నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము
నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము

ములకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు
మందిలున్న మనసునంతా ముంచి ముద్దజేసినావు
ఇగనుండి నువ్వే నాషాను దుమ్ము దులిపేద్దాం రావోయ్ దునియాను
ఇగనుండి నువ్వే నాషాను ఏది ఏమైనా నీతోనే నేను…


సయ్యారే సయ్యారే సారంగ (SAYYARE SAYYARE SARANGA) సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment