మహారాష్ట్ర లోని అత్యంత సుందరమైన జలపాతాలలో ముఖ్యమైన జలపాతం నానెమచి జలపాతం (nanemachi waterfall). దట్టమైన అడవి చుట్టు ఆకుపచ్చని ఎత్తు అయినా కొండలు మధ్య నానెమచి జలపాతం ఉంటుంది. ఈ జలపాతం సుమారు 400 అడుగులు ఎత్తునుండి కిందకి పడుతుంది. నానెమచి జలపాతం చుటూ ఆకుపచ్చని గుబురులతో కూడిన ఎత్తుఅయిన చెట్లు ,పక్షుల వాటి అరుపులతో నానెమచి జలపాతాన్ని(nanemachi waterfall) చూడడానికి వచ్చిన యాత్రికులకు ప్రకృతి ప్రేమికులకు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నానెమచి జలపాతం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహద్ తాలూకా లోని నానెమచి గ్రామ సమీపంలో ఉంది. నానెమచి గ్రామా వద్ద నుండి 2 కిలోమీటర్ దూరంలో కాళీ నడకన దట్టమైన అడవి గుండా నానెమచి జలపాతాన్ని(nanemachi waterfall) చేరుకుంటారు. ఎక్కువగా జులై, ఆగస్టు ,సెప్టెంబర్ నెలలో నానెమచి జలపాతం అందాలు చూడడానికి ప్రకృతిప్రేమికులు యాత్రికులు చేరుకుంటారు.నానెమచి జలపాతాన్ని ఇతర దేశాలు మరియు రాష్టాలు నుండి రోడ్డు మార్గం లేదా విమాన మార్గం ధ్వారా చేరుకోవడానికి అతి దగ్గరగా ఉండే ముఖ్యపట్టణము ‘పూణే’ (pune) అని చెప్పవచు. పూణే నుంచి నానెమచి జలపాతం 120 కిలోమీటర్ దూరం లో ఉంది. బస్సు ,క్యాబ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
66
previous post