Home » నల్లంచు సీరదేవయ్యె సాంగ్ లిరిక్స్ – జానపద పాట

నల్లంచు సీరదేవయ్యె సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comment

ఆమె : నల్లంచు చీర దేవయ్యో
నల్లని రైక దేవయ్యో
మల్లె పులా చిన్నదాన్ని మందలించవయ్యో
ముద్దా బంతి పూలు తెచ్చి ముద్దాడు బావయ్యో

అతడు : చక్కని ఓ రాధా
విన్నవే నా గాధ

చక్కని ఓ రాధా
విన్నవే నా గాధ
మనవాడుకుందాము అన్నావు మరిచిపోవుగదా

ఆమె : బావయ్యో రవయ్యో
నల్లంచు చీర దేవయ్యో
నల్లని రైక దేవయ్యో
మల్లె పులా చిన్నదాన్ని మందలించవయ్యో

ఎట్టు వైపు చూసిన
ఏం పని చేసిన
నీ ధ్యాసలో నేనుంటాను
వయసులో చిన్నదాన్ని
వరసైన కుర్రదాన్ని
ఏలు బట్టి యేలుకో

ఎన్నడూలేనిది ఈ చిన్ని గుండెకు
నిన్ను చూడబుద్దయ్యారా
మొద్దోలే నేనున్నా చచ్చి బతుకున్న
మా వోళ్ళను ఒపించా రావేరా

అతడు : చంటి పాపాలే కంటికి రేపోలే
చూసుకుంటానే నేనెమ్మా
చిన్న బాధున్న ఎవ్వరేమన్న
చిన్నబోనీయమ్మ

చంటి పాపాలే కంటికి రేపోలే
చూసుకుంటానే నేనెమ్మా
చిన్న బాధున్న ఎవ్వరేమన్న
చిన్నబోనీయమ్మ

ఆమె : బావయ్యో బావయ్యో
నల్లంచు చీర దేవ య్యో
నల్లని రైక దేవయ్యో
మల్లె పులా చిన్నదాన్ని మందలించవయ్యో

మనవూరి చిలకల్లా మందార తోటల్లా
మనువాడుతనన్నా మాటలు
చాపంగి మీసాల మీద ఒట్టేసి
చెప్పినావ్ నేను మరువను

అతడు : రైకపు రామ్మా
కలతా నీకు ఏందుకే బామ్మా

ఆమె : ఏడు అడుగులేసి చుట్టూ కాపుగాసి
చూసుకుంటూ ఉండిపోతారా
నీతోడు నేనుంటా నాతోడు నువుంటే
నా పంచ ప్రాణాలే నిదిరా

అతడు : మొగలి పులా మనస్సు
ముత్యమని తెలుసు
సొగస్సు సోకులున్నదాన
నంధివర్ధనంతో ముక్కోటి దేవుళ్లను
మొక్కి ఒక్కటవుతా జాన

మొగలి పులా మనస్సు
ముత్యమని తెలుసు
సొగస్సు సోకులున్నదాన
నంధివర్ధనంతో ముక్కోటి దేవుళ్లను
మొక్కి ఒక్కటవుతా జాన

రావమ్మో రధమ్మో
నువ్వే నా బంగారమమ్మో
నువ్వే నా ప్రాణములెమ్మో
ఏలు బట్టి ఏడేడు జన్మల తోడు ఉంటానమ్మో
నువ్వు లేకపోతే బ్రతుకు చీకటవ్వులేమ్మో


రచయిత :- నాగరాజు కసాని (Nagaraju Kasani)
గాయకుడు :- రంగ బట్టు శైలజ ( Ranga & Battu sailaja)
సంగీతం :- కృష్ణుడు (Krishnudu)


సిట్ట సిట్టెండ కొట్టే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment