Muddabanthi Puvvu ila Song Lyrics in Telugu
ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
నేటికి నేడు మారిన ఈడు చేసె నేరమే
నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే
చక్కదనాల చుక్కకివాళ దిష్టి తీసి హారతీయనా
అమ్మడివే
(స, ద ని స, ద ని స మా గ మ, గ స
ద ని స, గ గ స, ద ప గ స, గ గ, స ని ద ని స)
కలలను దాచే నా కన్ను నీవే
నిజమైపోవే నావన్ని నీవే
పగలే మెరిసే మిణుగురువే
నగలే వెలిసే వెలుగు నువే
ఇలపై నడిచే మెరుపు నువే ‘హా
ఇకపై వరమై దొరుకు నువే
నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే
నేనెపుడూ నీ వెంటే ఉంటా
ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
పరుగులు తీసే నా రాణి నీవే
పడితే మెత్తని నేలౌతాలే
ఎపుడూ నిలిచే భుజమౌతా
కలను కంటే నిజమౌతా
కష్టం వస్తే కలబడతా ‘హా
కడదాకా నే నిలబడతా
అలిసొస్తే జో కొడతా
గెలిచొస్తే జై కొడతా
కలిసొస్తే ఓ గుడినే కడతా
ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
హోయ్ మౌనంగానే సైగలతోనే ఎంత కాలమే
జాలిని చూపి దగ్గరయ్యేటి దారి చూపవే
ఆపసోపాలే నావిక ఆపే ఒక్కసారి చెంత చేరవే
అమ్మడివే
అమ్మడివే
Song Credits:
పాట – ముద్దబంతి (Muddabanthi)
చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి (Kousalya Krishnamurthy)
గాయకులు – యాజిన్ నజీర్ (Yazin Nazir)
సాహిత్యం – కృష్ణకాంత్ (Krishna Kanth)
సంగీతం – ధిబు నినన్ థామస్ (Dhibu Ninan Thomas)
నటీనటులు : ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.