మొన్న కనిపించావు
మైమరచిపోయాను
అందాలతో నన్ను
తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా
నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో
కాలమే వృధా ఆయనే
పరువాల నీ వెన్నెల
కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు
వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా
అవుదాం జత
ఈ పొద్దే నా తోడు
వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా
అవుదాం జత
మొన్న కనిపించావు
మైమరచిపోయాను
అందాలతో నన్ను
తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా
నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో
కాలమే వృధా ఆయనే
త్రాసులో నిన్నే పెట్టి
తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ
భలే ప్రేమ చూసిన నేను
హత్తుకోకపోతానా అందగాడా
ఓ నీడవోలే వెంబడి ఉంటా
తోడుగా చెలీ
పొగవోలే పరుగున వస్తా
తాకనే చెలీ
వేడుకలు కలలు నూరు
వింత ఓ చెలి
మొన్న కనిపించావు
మైమరచిపోయాను
అందాలతో నన్ను
తూట్లు పొడిచేసావే
ఏన్నెన్నినాళ్ళైనా ఓ మై లవ్
నీ జాడ పొడలేక ఎస్ మై లవ్
ఎందెందు వెతికానో
కాలమే వృధా ఆయనే
కడలి నేల పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటుంది ఈ వేళలో
తలవాల్చి ఎడమిచ్చావే
వేళ్ళు వేళ్ళు కలిపేసావే
పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను
కునుకులేకనే
హృదయమంత నిన్నే కన్నా
దరికిరాకనే
నువ్వు లేక నాకు లేదు
లోకమన్నదే
మొన్న కనిపించావు
మైమరచిపోయాను
అందాలతో నన్ను
తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా
నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో
కాలమే వృధా ఆయనే
పరువాల నీ వెన్నెల
కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు
వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా
అవుదాం జత
ఈ పొద్దే నా తోడు
వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా
అవుదాం జత
వెన్నెలా వెన్నెలా వెన్నెలా
చిత్రం: సూర్య S/O కృష్ణన్
గాయకులూ: నరేష్ ఇయర్, ప్రశాంతిని.
సాహిత్యం: వేటూరి సుందర రామ మూర్తి
సంగీతం: హరీష్ జయరాజ్
దర్శకుడు: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నటులు: సూర్య, సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.